గజ్వేల్ పట్టణంలో సోమవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. వార్డులు తిరుగుతూ ప్రజలతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, సీఎం ఆరెఫ్ కింద బాధితులకు ఆర్ధిక సహాయాన్ని ఎంపి అందచేశారు. అమ్మఒడి అంబులెన్స్ వాహనాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో గడా స్పెషల్ అధికారి హనుమంతరావు, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్,కౌన్సిలర్లు, టీఆరెస్ నాయకులు పాల్గొన్నారు.
*గజ్వేల్ లో వృద్ధురాలికి ఆసరా పింఛన్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి అందించారు .–courtesy:chaitanya,Gajwel