శ్రీశైలం ఆలయ ప్రాంగణంలో సోమవారం భజన కార్యక్రమం జరిగింది .త్రిఫల వృక్షం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో భక్తి గీతాలను ఆలపించారు. కర్నూలు కు చెందిన శ్రీ దత్తాత్రేయ ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 40 మంది భక్త బృందం శివ గీతాలతోపాటు అమ్మవారిపై భక్తి గీతాలను ఆలపించారు.గత 20 సంవత్సరాలుగా శ్రీశైలం దేవస్థానం , పెచ్చెరువుల వద్ద భజన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు భజన బృందం తెలిపింది .