శ్రీశైలం దేవస్థానం వారు ఆదివారం ఘనంగా సూర్య ఆరాధన పూజలు నిర్వహించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖ సూచనల మేరకు ఈ కార్యక్రమం జరిపారు . హరిహరరాయ గోపురం వద్ద మాడవీధిలో ఈ ఘన కార్యక్రమం నిర్వహించారు . అర్చక స్వాములు ,వేద పండితులు గణపతి పూజ , సూర్య ఆరాధన తదితర పూజలు జరిపారు . ముందుగా లోకకల్యాణం కోసం అర్చక స్వాములు , వేద పండితులు సంకల్పాన్ని చెప్పారు . దేశం శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ,ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగిన వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలాని సంకల్పంలో వినతి చేసారు . జనులకు ఆయురారోగ్యాలు కలగాలని , అకాల మరణాలు కలుగరాదని విన్నవించారు . దేశంలో అగ్ని ప్రమాదాలు ,వాహన ప్రమాదాలు మొదలైనవి జరుగకుండా ఉండాలని , అన్ని సామాజిక వర్గాల ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని లోక కల్యాణ సంకల్పాన్ని చెప్పారు .
ఈ కార్యక్రమం అనంతరం సూర్య నమస్కారాలు చేయించి ప్రసాద వితరణ చేసారు . ఇదో ప్రత్యేక కార్యక్రమంగా నిలిచిపోతుంది . ఆసాంతం ఆకట్టుకుంది .