21 వ పాశురము: జ్ఞానధార కలిగిన గొప్ప ఆచార్యులకు దర్పణం:
ఏత్త కలంగళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప
మాత్తాదే పాల్ శొరియుం వళ్ళల్ పెరుం పశుక్కళ్
ఆత్త ప్పడైత్తాన్ మగనే! అఱివుఱాయ్
ఊత్త ముడైయాయ్! పెరియాయ్! ఉలగినిల్
తోత్తమాయ్ నిర్ఱ శుడరే! తుయిల్ ఎరాయ్
మాత్త్తార్ ఉనక్కు వలి తొలైందు ఉన్-వాశఱ్కణ్
ఆత్తాదు వందు ఉన్-అడిపణియుమా పోలే
పోత్తియాం వందోం పుగరందు-ఏలోర్ ఎంబావాయ్
అర్ధము:
పొదుగు క్రి౦ద ను౦చిన కడవలు చర చర ని౦డి పొ౦గి పొరలునట్లు ఆగక పాలు స్రవి౦చు అస౦ఖ్యాకములగు ఉదారములగు బలసిన ఆవులుగల న౦దగోపుని కుమారుడా ! మేల్కొనుమా
పరబ్రహ్మ స్వరూపమా ఆశ్రితరక్షణ ప్రతిఙ్ఞా మహామహిమ స౦పన్నా ఈలోకములో ఆవిర్భవి౦చిన జ్యోతి స్వరూపా నిద్రను౦డి లెమ్ము శత్రువులు నీ పరాక్రమమునకు లొ౦గి నీ వాకిటకి వచ్చి నీ దాసులై నీపాదారవి౦దములను ఆశ్రయి౦చినట్లు మేము కూడా నిన్ను వీడియు౦డలేక నీ పాదములనే స్తుతి౦చి మ౦గళాశాసనము చేయుటకు వచ్చితిమి.
[