శ్రీ రంగం క్షేత్రంలో బుధవారం అధ్యయనోత్సవం లో విశేషం చోటుచేసుకుంది. శ్రీ అహోబిల మఠం స్థాపనాచార్యులైన ఆదివన్ శఠగోప యతీంద్ర మహాదేశికుల వారిచే ఏర్పాటైన పొలియన్ శిరప్పు విశేషం జరిగింది . భగవత్ రామానుజులకు సంబంధించిన పాశురం అనుసంధించు వేళ ఆ పాశురమును విని శ్రీ ఆదివన్ శఠగోప స్వామి శ్రీ రంగం రంగనాథ స్వామి వారికి విశేష బహుమానాలు సమర్పించారు.
భగవద్ రామానుజుల మీద అతీత భక్తిచే శ్రీ రంగం రంగనాథ స్వామికి శ్రీ అహోబిల మఠం స్థాపనాచార్యులైన ఆదివన్ శఠగోప యతీంద్ర మహాదేశికులు ఏర్పాటు చేసిన పొలియన్ శిరప్పు సంప్రదాయం నేటికి కొనసాగుతోంది
ఇందులో భాగంగా శ్రీ రంగం ఉత్తరవీధిలో గల శ్రీ అహోబిల మఠంలో బుధవారం మధ్యాహ్నం శ్రీ రంగనాథ స్వామి కి బియ్యం,గుమ్మడికాయ ,పట్టు వస్త్రం మొదలైన బహుమానాలను ఆదివన్ శఠగోప స్వామి ముందు సమర్పించారు.అనంతరం శ్రీ రంగం రంగనాథ స్వామి ఆలయ అర్చకులు, అధికారులు అహోబిల మఠానికి వేంచేసి వారికి శ్రీ శఠారి మర్యాద ఒక ఆనవాయితి . ఆలయం నుంచి వచ్చిన అధికారులు మఠంలో శ్రీవైష్ణవులకు చందనాది తాంబూలం అందించడం ఆనవాయితి .అనంతరం ,గజ,తురగ ఛత్ర చామరాది సమస్త రాజోపచారములతో శ్రీ అహోబిల మఠం పీఠాధిపతి వారి ముద్రకర్త,ఆ బహుమానాలను వెయ్యి కాళ్ల మండపములో వేంచేసి ఉన్న రంగనాథ స్వామికి సమర్పణ,అహోబిల మఠం వారికి పరివట్టం,శఠారి మర్యాదలు సంప్రదాయం . మఠం నుంచి సమర్పించే వస్త్రాన్ని తిరుమేని పై ధరించి శ్రీ రంగనాథులు సన్నిధికి వేమ్చేపు ఆనవాయితి. రాత్రి శ్రీ రంగనాథులు ఆరగించిన ప్రసాదాన్ని ఆలయ అర్చకులు రాజోపచారములతో శ్రీ అహోబిల మఠానికి తీసుకొనివచ్చి శ్రీ ఆదివన్ శఠగోప యతికి నివేదిస్తారు.ఈ విధమైన మర్యాద శ్రీ రంగంలో అహోబిల మఠానికి మాత్రమే కలదు.