కీళ్ వానమ్ వెళ్ళెన్రు ఎరుమై శిరువీడు
మేయ్ వాన్ పరన్దనకాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్
పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తున్నై
కూవువాన్ వన్దు నిన్రోమ్ కోదుకలముడైయ
పావాయ్ ! ఎళున్దిరాయ్ పాడిప్పరైకొణ్డు
మావాయ్ ! పిళన్దానై మల్లరై మాట్టియ
దేవాదిదేవనై చ్చెన్రునామ్ శేవిత్తాల్
ఆవావెన్రా రాయ్ న్దరుళేలో రెమ్బావాయ్.
:
ఆండాళ్,శ్రీ కృష్ణుని ప్రీతి పాత్రురాలగు ఒక గోపిక ఇంటి ముందు నిలబడి ,ఆమెను నిద్ర లేపుతున్నది.
” తూర్పు దిక్కున ఆకాశం తెల్లబడినదని, గేదెలు మేతమేయడం కోసం పచ్చిక బయళ్లకు చేరాయి.కన్నె పిల్లలందరు శ్రీ కృష్ణుని కొరకు వెళ్తుంటే నిన్ను తీసుకొని వెళ్ళాలని , నీ ఇంటి ముందు ఆగాము .ఎందుకంటే, నిన్ను చూడాలని శ్రీ కృష్ణుడే కుతూహలం పడతాడు.ఇక లెవమ్మా, మనం సంకీర్తనం చేసుకుంటూ, గుర్రం రూపంలో వచ్చిన అశ్వాసురుని నోట్లో చెయ్యిపెట్టి సంహరించిన ఆ దేవాదిదేవుని సన్నిధికి వెళ్లెదము.మన రాకను తెలుసుకొని స్వామి మనల్ని అనుగ్రహిస్తారు.
ధ్వని: తమో గుణము పోయి సత్వ గుణము పెరిగే సమయమిది.
courtesy: kidambi sethu raman and photo- great creator