తూర్పు గోదావరి జిల్లా కె .గంగవరం మండలానికి చెందిన రెండొందల మంది భక్త బృందం దివ్యదర్శనంలో భాగంగా గురువారం శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించింది . ఆలయ రాజగోపురం వద్ద అధికారులు , అర్చక స్వాములు స్వాగతం పలికారు. బృందం సభ్యులకు స్వామి అమ్మవారి దర్శనం కల్పించారు.సాంప్రదాయ కార్యక్రమాలు జరిపారు.విభూతి , కుంకుమ ,లడ్డు ప్రసాదం అందించారు.