భాగ్యనగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తడంతో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. హుస్సేన్ సాగర్ నుంచి నీటిని విడుదల చేయడంతో ఉప్పొంగి ప్రవహిస్తున్న నారాయణ గూడ నాలాను, ఎన్టీఆర్ పార్క్ ముందు జరుగుతున్న మరమ్మతు పనులను, డ్రైనేజీ మరమ్మతులను, నీట మునిగిన పలు కాలనీలను సందర్శించారు. బాధితులకు ధైర్యం చెప్పారు. ఆపత్కాలంలో సహాయ కార్యక్రమాల వేగం పెంచాల్సిందిగా జీహెచ్ఎమ్సీ, జలమండలి అధికారులను ఆదేశించారు.