స్కందమాత అలంకారం-శేషవాహనసేవ 

శ్రీశైల దేవస్థానం:దసరా మహోత్సవాలలో భాగంగా అయిదో  రోజు గురువారం  ఉదయం

అమ్మవారికి ప్రాతకాల పూజలు, విశేషకుంకుమార్చనలు, నవానరణార్చనలు, జపానుష్టానాలు,
పారాయణలు, సూర్య నమస్కారములు, చండీహోమం, పంచాక్షరి, బ్రామరి, బాలా జపానుష్థానములు,
చండీపారాయణ, చతుర్వేద పారాయణలు, కుమారీపూజలు నిర్వహించారు.

అదేవిధంగా రుద్రహోమం, రుద్రయాగాంగ జపములు, రుద్ర పారాయణలు జరిపారు.

అదేవిధంగా ఈ సాయంకాలం జపములు, పారాయణలు, నవావరణార్చన, కుంకుమార్చన,
చండీ హోమం జరిగాయి. రాత్రి  కాళరాత్రిపూజ, అన్మువారి ఆస్థాన సేవ, సువాసినీపూజలు

జరిగాయి.

దసరా మహోత్సవాలలో భాగంగా ప్రతీరోజు కుమారీ పూజలు నిర్వహిస్తున్నారు.ఈ కుమారిపూజలో రెండుసంవత్సరాల నుంచి పదిసంవత్సరాల వయస్సు ఉన్న బాలికలను
పూలు, పండ్లు, నూతన వస్త్రాలను సమర్పించి పూజిస్తారు. కుమారిపూజ నవరాత్రి
ఉత్సవాలలో ఒక ముఖ్యమైన సంప్రదాయం

‘ స్కందమాత అలంకారం:

ఈ నవరాత్రి మహోత్సవాలలో నవదుర్గ అలంకారాలలో భాగంగా
శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తిని స్కందమాత స్వరూపంలో అలంకరించారు.నవదుర్గలలో ఐదవరూపమైన ఈ దేవి చతుర్చుజాలను కలిగిఉండి, ఒకచేతిలో స్కందుణ్ణి
పట్టుకుని ఉండి, , అభయముద్రలను ధరించి ఉంటుంది. ఈమె ఒడిలో
బాలుని రూపంలో స్కందుడు (కుమారస్వామి) కూర్చొని ఉంటాడు స్కందదేవుని జనని కావడం వలన
ఈ దుర్గాస్వరూపం స్కందమాతగా ప్రసిద్ధి చెందింది. ఈ స్కందమాతను ఉపాసించడం వల్ల
స్కందదేవుని కూడా ఉపాసన చేసిన ఫలితం లభిస్తుందని చెబుతారు. ఈ దేవిని ఆరాధించడం వలన
సకల కోర్కెలు నెరవేరడమే కాకుండా శాంతి లభిస్తాయి.

ఈ ఉత్సవాలలో శ్రీస్వామిఅమ్మవార్లకు నిర్వహిస్తున్న వాహనసేవలలో భాగంగా
నిర్వహించారు.ఈ వాహనసేవలో శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరింపజేసి, శేషవాహనంపై వేంచేబు చేయించి పూజాదికాలు జరిపారు.

print

Post Comment

You May Have Missed