శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) ఆదివారం శ్రీ నరహరి మణికంఠ , బృందం, హైదరాబాద్ వారు భక్తి సంగీత కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుండి ఈ భక్తి సంగీత కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమం లో గణపతి కీర్తన ఓంకారనాదం, శంకరా శశిధర, శ్రీచక్రరాజ సింహాసనే మొదలైన పలు కీర్తనలను సి.హెచ్. సృజన, రాజేశ్వరి, సుధారాణి, రమ్య, శోభారాణి, శిరీష, సౌమ్యశ్రీ, శ్రీవాణి, వీరలక్ష్మి, వెంకటలక్ష్మి, రామలక్ష్మి సరిత, శ్యామల అనురాధ, శారద, జ్యోతి, భాగ్యలక్ష్మి ఆలపించారు.
ఈ కార్యక్రమానికి తబలా సహకారాన్ని రమేష్, పియానో సహకారాన్ని యాదగిరి అందించారు.
కాగా ఈ నిత్య కళారాధనలో ప్రతిరోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయకళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన జరుగుతోంది.