శ్రీశైల దేవస్థానం:ఉగాది మహోత్సవాలలో మూడవ రోజు శనివారం శ్రీ స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక్య పూజలు జరిగాయి. ఆ తరువాత స్వామివారి యాగశాలలో చండీశ్వరపూజ, మండపారాధనలు, కోసం జపానుష్ఠానాలు రుద్రహోమం నిర్వహించారు.అదేవిధంగా ఉదయం అమ్మవారి యాగశాలలో చండీహోమం జరిగింది.
అమ్మవారికి విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు చేశారు. సాయంత్రం 5.30 గంటలకు సాయంకాల పూజలు, జపానుష్ఠానాలు జరిపారు.
ప్రభోత్సవం:
ఉగాది మహోత్సవాలలో భాగంగా ఈ సాయంకాలం గం.5.30లకు శ్రీస్వామిఅమ్మవార్ల ప్రభోత్సవం జరిపారు.
రథోత్సవంలో రథానికి చేసినట్లుగానే ప్రభోత్సవంలో కూడా ప్రభకు బంతి, చేమంతి, గులాబి, సుగంధాలు, కనకాంబరాలు మొదలైన 11 రకాల పుష్పాలతో పుష్పాలంకరణ చేశారు.
నందివాహన సేవ:
వాహన సేవలలో భాగంగా ఈ రోజు సాయంకాలం శ్రీస్వామిఅమ్మవార్లకు నందివాహనసేవ నిర్వహించారు.
ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను నందివాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. తరువాత గ్రామోత్సవం జరిపారు..
నందివాహనాధీశులైన శ్రీస్వామి అమ్మవార్లను దర్శించడం వలన చేపట్టిన పనులలో విజయం లభిస్తుందని, భోగభాగ్యాలు కలుగుతాయని నమ్మకం.
:
ఉగాది మహోత్సవాల అలంకారాలలో భాగంగా ఈ సాయంకాలం శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తిని మహాసరస్వతి స్వరూపంలో అలంకరించారు.
చతుర్భుజాలు కలిగి ఉండి, వీణ, అక్షమాల పుస్తకాన్ని ధరించిన ఈ దేవిని దర్శించడం వలన విద్యాప్రాప్తితో పాటు అభీష్టాలు సిద్ధిస్తాయని ప్రతీతి.
గ్రామోత్సవంలో కోలాటం, చెక్కభజన, జానపద పగటి వేషాల ప్రదర్శన, తప్పెటచిందు, కర్ణాటక జాంజ్, కన్నడ జానపదడోలు, నందికోలుసేవ, మొదలైన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
ఈ రోజు రాత్రి గం.10.00లకు శివదీక్షా శిబిరాల వద్ద కన్నడ భక్తులచే అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమం ప్రత్యేకం. వీరాచార సంప్రదాయాన్ని అనుసరించి జరిపే ఈ కార్యక్రమానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. అగ్నిగుండ ప్రవేశానికి ముందు వీరాచార విన్యాసాలు జరుగనున్నాయి.
కర్ణాటకు చెందిన వీరశైవ భక్తులు వీరభద్రవచనాలను పఠిస్తూ, ప్రత్యేక వేషధారణలతో, వివిధ వాయిద్యాల నడుమ విన్యాసాలు చేయనున్నారు. వీరిని పురవంతులు అని పిలుస్తారు