
శ్రీశైల దేవస్థానం: ఉగాది ఉత్సవాలు, సోమవారం ౩ వ రోజు విశేషాలు.
• ఈ రోజు ఉదయం 8 గంటలకు చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చనలు, జపానుష్ఠానములు జరిగాయి• ఉత్సవాలలో భాగంగా లోకకల్యాణార్థం రుద్రహోమం, చండీహోమం, జపాలు, పారాయణలు జరిపారు.
• శ్రీస్వామివారికి విశేషార్చనలు, అమ్మవారికి విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు జరిపారు.
• సాయంత్రం 5.30 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రభోత్సవం జరిగింది.
• రాత్రి 7.00గంటలకు శ్రీ స్వామిఅమ్మవార్లకు నందివాహనసేవ పూజలు నిర్వహించారు.
• అమ్మవారికి మహాసరస్వతి అలంకారం చేసారు.
• రాత్రి 7.30 గంటల నుండి పురవీధుల్లో గ్రామోత్సవం ఘనంగా జరిగింది.
• రాత్రి 8.00గంటలకు శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం అనంతరం ఏకాంతసేవ జరిపారు.
• రాత్రి 10.00 గంటలకు శివదీక్షా శిబిరాల వద్ద వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం ప్రత్యేకం.