శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం
గణేశ సదనము నిర్మాణాన్ని పరిశీలించిన
కార్యనిర్వహణాధికారి
ఈ రోజు సాయంత్రం (26.01.2022) కార్యనిర్వహణాధికారి గణేశసదనము నిర్మాణాన్ని పరిశీలించారు.
టూరిస్ట్ బస్టాండ్ సమీపంలో భక్తుల వసతి కోసం 224 గదుల సముదాయాముగా గణేశ సదనము నిర్మింపబడుతోంది.
మొత్తం నాలుగు బ్లాకులుగా నిర్మిస్తున్న ఈ సముదాయంలో ఎ బ్లాక్ నందు 56 గదులు, బి బ్లాకులో 56 గదులు, సి బ్లాకులో 48 గదులు, డి బ్లాకులో 64 గదులు నిర్మించబడ్డాయి.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి వారు మాట్లాడుతూ మార్చి నెలాఖరులోగా పనులన్నీ పూర్తి చేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.
అలాగే సముదాయ ప్రాంగణం నాలుగువైపులా సీసీ రోడ్డు వేయాలని సూచించారు. అదేవిధంగా కాంపౌండ్ వాల్ కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆ తరువాత హెచ్ టి. యార్డు కూడా ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.
ఇంకా వారు వసతి సముదాయ ప్రాంగణానికి సమీపంలోనే వీలైనంత మేరకు పార్కింగ్ ప్రదేశాన్ని కూడా అభివృద్ధి చేయాలన్నారు.
అదేవిధంగా సముదాయ ప్రాంగణమంతా కూడా పచ్చదనం పెంపొందే విధంగా ల్యాండ్ స్కేపింగ్ పనులు కూడా చేపట్టాలన్నారు.
అనంతరం కార్యనిర్వహణాధికారివారునక్షత్రవనాన్ని పరిశీలించారు. వీలైనంత త్వరగా నక్షత్రవనాన్ని కూడా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమములో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు భాస్కర్, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు నరసింహరెడ్డి, ఎఈలు భవన్ ,ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.