త్రిశక్తి శ్రీ శారదా పీఠం ఆధ్వర్యంలో 31 న కాశీ అన్నపూర్ణా వ్రతం, వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా , పెన్ పహాడ్ మండలం , ధర్మపురం గ్రామంలో నిర్మాణంలో ఉన్న సూర్యపంచాయతన దేవాలయం , కోటి లింగ ప్రతిష్ఠల దివ్య ప్రాంగణంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. శ్రీ విద్యోపాసకులు త్రి శక్తి శారదా పీఠం పీఠాధిపతి , చైర్మన్ తోపాటు ప్రముఖ సంస్కృత పండితులు శ్రీ ఆదిత్యానంద నాథ స్వామి,వేద పండితుడు శ్రీ మల్లంపల్లి దుర్గాప్రసాద శర్మ ఆధ్వర్యంలో భక్తుల తో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎంతమందైనా ఇందులో పాల్గొనవచ్చునని నిర్వాహకులు తెలిపారు . ఈ కార్యక్రమాల్లో పాల్గొనే స్త్రీలు ఈ నెల 25 లోపు గోత్రనామాలు , పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలతో ఉన్న కరపత్రాలను వెలువరించారు.