×

31వ తేదీన ఆర్జిత పరోక్షసేవగా వరలక్ష్మీవ్రతం

31వ తేదీన ఆర్జిత పరోక్షసేవగా వరలక్ష్మీవ్రతం

 శ్రీశైల దేవస్థానం:భక్తుల సౌకర్యార్థం  దేవస్థానం రేపు 31 న  పరోక్ష ఆర్జితసేవగా వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహిస్తోంది. రేపు ఉదయం 9.00 గం.ల నుండి ఆలయప్రాంగణములోని శ్రీస్వామిఅమ్మవార్ల నిత్యకల్యాణ మండపంలో ఈ వ్రతం జరుగుతుంది.కాగా ఈ పరోక్షసేవకు రూ.1,116-00లను రుసుముగా నిర్ణయించారు.

భక్తులు దేవస్థానం వెబ్ సైట్ www.srisailamonline.com ద్వారా సేవా రుసుము చెల్లించి పరోక్షంగా ఈ వరలక్ష్మీ వ్రతాన్ని జరిపించుకునే అవకాశం కల్పించారు.అదేవిధంగా క్యూ.ఆర్.కోడ్ ను ఉపయోగించి గూగుల్ పే, ఫోన్ పే, బి.హెచ్.ఐ.ఎమ్, పే.టి.ఎమ్ ద్వారా కూడా సేవా రుసుమును చెల్లించే సదుపాయం కూడా ఉంది.

సేవాకర్తలు వారి పేరున జరిగే సేవను వీక్షించేందుకు వీలుగా దేవస్థానం యూ ట్యూబ్ ద్వారా ఈ వరలక్షీ వ్రతాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.కాగా ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా పలువురు భక్తులు ఈ వరలక్ష్మీవ్రతానికి ఆన్లైన్ రిజిప్టేషన్ చేయించుకున్నారు. అదేవిధంగా ఇండోర్ నగరము నుండి ఒక భక్తుడు, లక్నో నుండి కూడా మరో భక్తుడు ఈ వరలక్ష్మీవ్రతానికి ఆన్ లైన్ రిజిప్టేషన్ చేయించుకున్నారు.

| మృత్యుంజయ హోమ పూర్ణాహుతి |

లోక కల్యాణం కోసం దేవస్థానం గత 11 రోజులుగా ప్రతిరోజు మృత్యుంజయ హోమాన్ని నిర్వహించింది. ప్రత్యేకంగా దేవస్థానం సేవగా సర్కారిసేవగా ఈ మృత్యుంజయ హోమం పూర్ణాహుతి జరిగింది.

దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలు

లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు 30 న  ఆలయప్రాంగణంలోని త్రిఫలవృక్షం క్రింద వేంచేబు చేసి ఉన్న శ్రీ దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలను నిర్వహించింది.ప్రతి గురువారం దేవస్థాన సేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యంవుంటుంది.

print

Post Comment

You May Have Missed