×

30 అంశాలపై విచారణకు ఏపీ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం

30 అంశాలపై విచారణకు ఏపీ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం

అమరావతి: గత ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను సమీక్షించి  చర్యలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటిని  వెలికితీసేందుకు కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు    చేస్తున్నట్లు  ప్రకటించారు. 30 అంశాలపై విచారణ చేయిస్తామని.. సీసీబీ, సీఐడీ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థల సహకారం తీసుకుంటామని వెల్లడించారు. బుధవారం  విద్యుత్‌రంగ సమీక్షా సమావేశంలో ఈమేరకు ప్రకటన చేశారు.

కరెంటు కొనుగోళ్లలో అక్రమాలపై దృష్టి పెట్టిన సీఎం , సోలార్, విండ్‌ పవర్‌ కొనుగోళ్లపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. కాంపిటేటివ్‌ బిడ్డింగ్‌ రేట్లకన్నా అధిక రేట్లకు ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానాకు రూ.2636 కోట్లు నష్టం వాటిల్లిందని, ఈ డబ్బును రికవరీ చేయాలని సీఎం ఆదేశించారు. కంపెనీలతో తిరిగి సంప్రదింపులు చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సోలార్, విండ్‌ కంపెనీలు దారికి రాకుంటే వారితో ఒప్పందాలు రద్దుచేయాలని సూచించారు. సోలార్, విండ్‌ కంపెనీలతో జరిగిన ఒప్పందాల్లో భారీ దోపిడీ జరిగినట్టు స్పష్టమైందన్నారు. ఈ వ్యవహారంలో ఎంతటివారున్నా వదిలిపెట్టొద్దని.. ఉన్నతాధికారులు, మంత్రి, ముఖ్యమంత్రి ఉన్నా సరే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సీఎం వైయ‌స్ జగన్‌ను కలిసిన నావికాదళ అధికారులు
క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్‌ను తూర్పు నావికాదళ వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్, నావికాదళ ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అభినందనలు తెలిపారు.

రైతులకు పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్, ఇంధన శాఖల అధికారులతో సమావేశం జరిపారు.

భూ సమస్యల పరిష్కారినికి ‍కమిటీ

తూర్పుగోదావరి : గత ప్రభుత్వం భూముల వ్యవహారం ఆన్‌లైన్‌ చేయడం వల్ల అనేక అవకతవకలు జరిగాయని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఆరోపించారు. ఫలితంగా రైతుల భూమి హక్కుకు భంగం కల్గిందని.. భద్రత లేదని విమర్శించారు. భూసమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయి రిటైర్డ్‌ జడ్జి, అనుభవజ్ఞులైన రిటైర్డ్‌ సర్వేయర్‌, రెవెన్యూ అధికారులతో ఒక కమిటీ నియమించాలని సీఎం జగన్‌ కలెక్టర్లను ఆదేశించారన్నారు. కాకినాడలో   పిల్లి సుభాష్‌ చంద్రబాస్‌, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. ఇక మీదట రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం అందజేయాలని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారని తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి సన్నబియ్యం సేకరించాలని జగన్‌ ఆదేశించారన్నారు. ఈ మేరకు చర్యలు ప్రారంభమయ్యాయని తెలిపారు.  ఇది ఒక ఆహ్లదకరమైన.. ఆహ్వానించదగిన నిర్ణయమని కొనియాడారు. రాష్ట్రంలో పూర్తి స్థాయి భూ సర్వే జరిగి దాదాపు 111 సంవత్సరాలు అవుతుందన్నారు. రీసర్వేను జగన్‌ ఒక చాలెంజ్‌గా తీసుకున్నారని.. దీనిపై అనుభవజ్ఞులైన అధికారులతో సమీక్షిస్తున్నారని తెలిపారు.

print

Post Comment

You May Have Missed