రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం అవుతున్న పల్లె ప్రగతి రెండో విడత కార్యాక్రమాలల్లో, 18 సం. లు పైబడి చదవడం రాయడం తెలియని నిరక్ష్యరాష్యుల జాబితాను ఈ నెల 10 వ తేది లోగా నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కల్లెక్టర్లను ఆదేశించారు. ఈ రోజు బీ ఆర్ కె ఆర్ భవనం నుండి పల్లె ప్రగతి రెండోవ విడత పై జిల్లా కల్లెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రంలో వయోజనుల అక్షరాస్యతను పెంపొందిచడం కోసం ప్రత్యేక క్యాoపెయిన్ నిర్వహించాలని చెప్పారు . రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్ర శేఖర్ రావు అక్షరాస్యత పెంపుకోసం అన్ని గ్రామ పంచాయతులలో Each One- Teach One చేపట్టాలని నిర్ణయించారని అన్నారు.ఈ సమావేశం లో పంచాయత్ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాష్ రాజ్, సెన్సెస్ డైరెక్టర్ ఇలం బర్తి, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోజ్, పంచాయత్ రాజ్ కమి షనర్ రఘునందన్ రావు పాల్గొన్నారు.