*Kidambi Sethu raman*
వర్ధతాం అహోబిల శ్రీ:
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం
అహోబిలం.
నృసింహ జయంతి మహోత్సవం
(అవతారోత్సవాలు)
08.5.2019 నుండి 17.05.2019 వరకు
భాష్యకారుల తిరునక్షత్రం
………………………………………
రెండవ రోజు:
నృసింహ జయంతి అవతారోత్సవాలను పురస్కరించుకుని శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో ఈ రోజు ఉదయం శ్రీ ప్రహ్లాదవరదులకు నవ కలశ పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించారు.
సాయంత్రం శ్రీ సన్నిధిలో బ్రహ్మాణ్డ పురాణాంతర్గత శ్రీ అహోబిల క్షేత్ర మాహాత్మ్యంలో గరుడాద్రి తెలియజేసే రెండవ అధ్యాయమును శ్రీ అహోబిల దేవాలయ ధర్మకర్త శ్రీ అహోబిల మఠం పీఠాధిపతి వారి ముద్రకర్త స్వామి వారికి విన్నవించారు.
తదనంతరం శ్రీ ప్రహ్లాదవరదులు తిరువీధులలో ఊరేగారు.
భగవద్ భాష్యకారుల తిరునక్షత్రం సందర్భంగా శ్రీ ప్రహ్లాదవరదులు భాష్యకారుల సన్నిధికి వేంచేశారు.తదనంతరం శాత్తుమోరై, గోష్ఠి.
Vardhathaam Ahobila Sri:
Sri Ahobila math Paramparadheena
Sri MadAadivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.
Nrusimha Jayanthi Mahothsavam
(Avathaarothsavam)
08.5.2019 to 17.05.2019
Bhashyakara jayanthi
……………………………………..
Day 2:
Today is the second day of Nrusimha jayanthi Avathaarothsavam.
As a part of this Nava kalasa poorvaka panchaamrutha abhishekam is performed in the morning.
Later, in the evening, second canto (dvitheeya adyayam) of Ahobila kshetra mahatmyam in Brahmanda puraana is recited in sri sannidhi by Mudrakartha on behalf of HH peetadhipathi of Sri Ahobila math, Hereditary trustee.
This is followed by Thiruveedhi utsavam.
On occasion of Bhashyakara jayanthi sathumorai and gosti performed at bhashyakara sannidhi