*kidambi sethu raman*
శ్రీ అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవం లో జరిగే కల్యాణోత్సవానికి పద్మశాలి సంఘం వారిచే ఎన్నుకున్న సంఘ సభ్యులైన ఇద్దరు దంపతులు ఉభయదారులుగా వ్యహరిస్తారు. వారిని ఉభయదారులుగా వ్యహరించమని శ్రీ అహోబిలం దేవాలయ పరంపర ధర్మకర్తయగు శ్రీ అహోబిల మఠం పీఠాధిపతి వారు తన ముద్రకర్త చే శ్రీ ముఖం ఇచ్చి నియమించాలి.ఇది అనాదిగా అహోబిలం దేవాలయం లో కొనసాగుతూ వస్తున్న సంప్రదాయం. అనుగుణంగా మార్చి 17,18 తేదీలలో ఎగువఅహోబిలం , దిగువ అహోబిలం లో బ్రహ్మోత్సవం లో భాగంగా కల్యాణోత్సవం లో పద్మశాలి సంఘం వారిని ఉభయదారులుగా నియమిస్తూ శ్రీ అహోబిల మఠం 46వ పీఠాధిపతి వారి ముద్రకర్త శ్రీ వేణుగోపాలాచార్యులు వారికి శ్రీముఖం అందజేశారు.