శ్రీశైల దేవస్థానం:శ్రీశైల మహాక్షేత్రంలో 25 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని ఈ ఓ సూచిన్చారు. చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళిక గురించి ఈ రోజు సమీక్షా సమావేశం జరిగింది.పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ఇంజనీరింగ్ అధికారులు, అన్ని విభాగాల అధిపతులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు. .
దర్శనం క్యూకాంప్లెక్స్ నిర్మాణానికి స్థలపరిశీలన, అవసరమైన చోట్ల అంతర్గత రహదారుల విస్తరణ, వలయ రహదారికి ఇరువైపులా సుందరీకరణ, క్షపరిధిలో మరిన్ని చోట్ల ఉద్యానవనాల ఏర్పాట్లు, పచ్చదనాన్ని పెంపొందించడం, మరిన్నిచోట్ల పార్కింగ్ ప్రదేశాల ఏర్పాట్లు, విద్యుద్దీకరణ పనులు, మంచినీటి సరఫరా, వ్యర్థ పదార్థాల పునర్వినియోగం మొదలైన అంశాల గురించి ఈ సమావేశంలో కూలంకుషంగా చర్చించారు. కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ రానున్న 20-25 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని అధికారులకు సూచించారు.స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించడం, భక్తులకు సౌకర్యాల కల్పన, క్షేత్రాభివృద్ధి అనే త్రిముఖ వ్యూహంతో ప్రణాళికను తయారు చేయాలని ఆదేశించారు. ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న కారణంగా వెంటనే క్యూకాంప్లెక్స్ నిర్మాణానికి స్థల పరిశీలన చేసి కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళికను, అంచనాలను రూపొందించాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థమై మరికొన్ని చోట్ల వసతి కల్పన, విచారణ కార్యాలయాలను ఏర్పాటు చేసే విధంగా కార్యాచరణను రూపొందించాలన్నారు.
నందిసర్కిల్ వద్ద ప్రసాద్ పథకం కింద నిర్మించిన యాత్రిక సదుపాయకేంద్రంలోనూ, టూరిస్ట్ బస్టాండ్ సమీపంలో గణేశ సదనం పేర నిర్మితమవుతున్న 224 గదుల సముదాయం వద్ద ఈ రిసెప్షన్ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని వసతివిభాగాన్ని కార్యనిర్వహణాధికారి ఆదేశించారు.ఈ కేంద్ర విచారణ కార్యాలయం వద్దనే భక్తులు ఆర్జిత సేవాటికెట్లు పొందే ఏర్పాటు కూడా ఉండాలన్నారు. క్షేత్రపరిధిలో మరిన్నిచోట్ల వాహనాల పార్కింగ్ గ్లకు ప్రదేశాలను గుర్తించి వాటిని వాహనాలను నిలిపేందుకు అనువుగా తీర్చిదిద్దాలన్నారు. ముఖ్యంగా పార్కింగ్ ప్రదేశాల వద్ద మంచినీటి సదుపాయం, శౌచలయాల ఏర్పాటు ఉండాలన్నారు.ప్రస్తుతం దేవస్థానం వైద్యశాల కుడివైపు ప్రాంతం, యజ్ఞవాటిక, టూరిస్ట్ బస్టాండ్, శివదీక్షా శిబిరాల వెనుకభాగం, ఉన్నత పాఠశాల సమీప ప్రాంతం మొదలైన చోట్ల వాహనాల పార్కింగునకు అవకాశం కల్పిస్తున్నారు.ముఖ్యంగా క్షేత్రంలో మరిన్నిచోట్ల శౌచాలయాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.క్షేత్రసుందరీకరణలో భాగంగా వలయ రహదారి పొడవునా ఇరువైపులా మరిన్ని మొక్కలను నాటాలన్నారు.
ఆలయ ఈశాన్యభాగంలో ఉన్న పాతపుష్కరిణీ ప్రాంతాన్ని సుందరీకరించి అభివృద్ధి పర్చాలని కూడా ఇంజనీరింగ్ అధికారులను కార్యనిర్వహణాధికారి ఆదేశించారు. దర్శనానంతరం భక్తులు సేదతీరేందుకు వీలుగా క్షేత్రంలో మరికొన్ని ఉద్యాన వనాలను ఏర్పాటు చేసేందుకు స్థలపరిశీలన చేయాలని ఇంజనీరింగ్, ఉద్యానవన విభాగాలను ఆదేశించారు. ఆలయంలో సృజనాత్మక విద్యుద్దీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆలయ ప్రాంగణం ఎన్నో ప్రాచీనకట్టడాలను కలిగి ఉందని, ఆకర్షణీయమైన లైటింగ్ వలన రాత్రి సమయాలలో కూడా భక్తులు వీటిని స్పష్టంగా చూడగలుగుతారన్నారు. ‘
*Kumaaraswaamy puja, Sahasra deepaarchana seva performed today. Archaka swaamulu performed the puja with traditions.