- Kidambi sethu raman *
శరణని కొలువరో శ్రీ హరి చక్రము
కరుణతో కాపాడు సుదర్శన చక్రము
మదనజనకుని మరురూపు చక్రము
పదహారుచేతుల పదునైన చక్రము
వేదములు వేదికిన వేలుపు చక్రము
మదమెక్కిన వారికి మరణము చక్రము
విజయవల్లికి విభుడగు వీర చక్రము
గజరాజును గాచిన గంభీర చక్రము
అజుడును హరుడును అర్చించు చక్రము
నిజమును నిలిపిన నరహరి చక్రము
ఆరుకోణముల అద్భుత చక్రము
ఆరుచక్రములు చూపు అంతిమ చక్రము
సురులు పొగడు పరదైవము చక్రము
గరుడాద్రీశుని కరభూషణము చక్రము
రత్నా0గి ,ముత్తంగి లలో శ్రీ అహోబిలం ప్రహ్లాదవరదుల దర్శనం,
sudarshana jayanthi@ ahobilam…..
A small pada pushpam to lotus feets of sri sudarshana