: Sri Ahobila math paramparaadheena
sri Adivan satagopa yatheendra mahadesika sri Lakshmi Narasimha swamy devasthaanam, Ahobilam.
ANNAKOOTOTHSAVAM
With the divine blessings and divine command of his holiness 46th jeer of sri ahobila math sri van sri satagopa sri ranganatha yatheendra mahadesikan,the hereditary trustee
Annakootothsavam will be performed on june 14th 2018 at lower ahobilam/
As a part of this event there will be veda prabanda parayanams.in the after noon ,MAHA HAVIRNIVEDANAM with different varieties of bhakshyams,different varieties of annam are offered to the Lord by reciting Anna sooktham.
All the prasadamswill be distributed to the devotees.
All the devotees are requested to attend the event.
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, అహోబిలం
యజ్ఞభోక్త యగు భగవంతుడు అత్యంత సులభుడై ద్వాపరయుగంలో గోప బాలురతో కూడి బృందావనంలో ఆటలాడుతూ పాటలు పాడుతూ వారితో కలిసి భోంచేశాడు.గోవర్ధనంబెత్తి గోవులను గోపాలకులను రక్షించాడు.అలా ఆ పరమాత్మ దివ్య లీలా వినోదమును మనకు తెలియ జేయునదే అన్నకూటోత్సవము.
ఆగమ శాస్త్రం ప్రకారం, స్వామికి అన్నకూటోత్సవము నిర్వహించి,అనేక రకాల భక్ష్యాలను ,ప్రసాదాలను నివేదించడం ద్వారా గో సంపద,సస్య సంపద పెరిగి లోకం సుభిక్షంగా ఉంటుంది.
దీనిని దృష్టిలో ఉంచుకొని లోక క్షేమాన్ని కాంక్షిస్తూ శ్రీ అహోబిల దేవాలయ పరంపర ధర్మకర్త శ్రీ అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీ వణ్ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికుల వారి నియమానుసారముగా శ్రీ అహోబలేశ్వరులకు june 14th 2018 న అన్నకూటోత్సవము నిర్వహించబోతున్నారు.ఇందులో భాగంగా దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాదవరదుని సన్నిధిలో ఉదయం వేద,దివ్య ప్రబంధ పారాయణము ఉంటుంది.మధ్యాహ్నం శ్రీ స్వామి వారికి వివిధ రకాల భక్ష్యాలను ,వివిధాన్నములను నివేదిస్తారు.ఆ ప్రసాదాన్ని భక్తులందరికి అందజేస్తారు.
భక్తులు,భాగవతులు ఈ మహా హవిర్నివేదనలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు.