×

కొత్త పారిశ్రామిక పార్కులతో పెట్టుబ‌డులు, ఉద్యోగావ‌కాశాల‌పై నివేదిక‌

కొత్త పారిశ్రామిక పార్కులతో పెట్టుబ‌డులు, ఉద్యోగావ‌కాశాల‌పై నివేదిక‌

మంత్రి కేటీఆర్ ఆదేశాల‌తో..

టీఎస్ ఐఐసీ పారిశ్రామిక పార్కుల బాట‌*కాక‌తీయ మెగా టెక్స్‌టైల్‌సిరిసిల్ల అప‌రెల్‌పార్కును సంద‌ర్శించిన

టీఎస్ ఐఐసీ ఎండీ న‌ర్సింహారెడ్డి*క్షేత్ర‌స్థాయిలో  అభివ్ర‌ద్ధి ప‌నుల ప‌రిశీల‌న‌వేగ‌వంతంగా పూర్తిచేయాల‌ని ఆదేశం*కొత్త పారిశ్రామిక పార్కులతో పెట్టుబ‌డులుఉద్యోగావ‌కాశాల‌పై నివేదిక‌

( హైద‌రాబాద్ – మే 30 )ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేర‌కు టీఎస్-ఐఐసీ ఎండీ ఈ వెంక‌ట న‌ర్సింహారెడ్డి బుధ‌వారం వ‌రంగ‌ల్‌, సిరిసిల్ల జిల్లాల్లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా కాక‌తీయ మెగా టెక్స్‌టైల్ పార్కును, సిరిసిల్ల‌ అప‌రెల్ పార్కును సంద‌ర్శించి అభివ్ర‌ద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించారు. రాష్ట్రంలో కొత్త‌గా ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక పార్కుల్లో అభివ్ర‌ద్ధి ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తిచేసి ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, కొత్త పార్కులతో రాష్ట్రానికి వ‌చ్చే పెట్టుబ‌డులు,ఉద్యోగావ‌కాశాల‌పై స‌మ‌గ్ర నివేదిక‌ను త‌యారు చేయాల‌ని  మంత్రి కేటీఆర్ మంగ‌ళ‌వారం ప‌రిశ్ర‌మ‌ల‌శాఖ స‌మీక్షా స‌మావేశంలో టీఎస్ ఐఐసీ ఎండీని ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. మంత్రి కేటీఆర్ ఆదేశాల‌కు వెంట‌నే స్పందించిన  టీఎస్ ఐఐసీ ఎండీ న‌ర్సింహారెడ్డి కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఇండ‌స్ట్రియ‌ల్‌పార్కుల అభివ్ర‌ద్ధి ప‌నుల‌ను క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈమేర‌కు బుధ‌వారం ఆయ‌న టీఎస్ ఐఐసీ ఉన్న‌తాధికారులు, ఇంజ‌నీరింగ్ అధికారుల‌తో క‌లిసి వ‌రంగ‌ల్ కాక‌తీయ మెగా టెక్స్‌టైల్ పార్కును, సిరిసిల్ల అప‌రెల్ పార్కును సంద‌ర్శించారు. వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా శాయంపేట్ స‌మీపంలో1100 ఎక‌రాల్లో ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నెల‌కొల్పుతున్న కాక‌తీయ మెగా టెక్స్‌టైల్ పార్కలో జ‌రుగుతున్న ప్ర‌హ‌రిగోడ‌, రోడ్డు ప‌నుల‌ను, సిరిసిల్లలో 150 ఎక‌రాల్లో ఏర్పాటు చేస్తున్న అపరెల్ పార్కులో అంత‌ర్గ‌త రోడ్లు, ప్ర‌హ‌రిగోడ నిర్మాణం, స‌బ్‌స్టేష‌న్ ప‌నులను టీఎస్ ఐఐసీ ఎండీ న‌ర్సింహారెడ్డి నేత్ర‌త్వంలోని అధికారుల బ్రందం ప‌రిశీలించింది. ఈ సంద‌ర్భంగా పారిశ్రామిక పార్కుల్లో చేప‌ట్టిన అభివ్ర‌ద్ధి ప‌నులు నాణ్య‌తా ప్ర‌మాణాల మేర‌కు జ‌రుగుతున్నాయా?.. లేదా? అన్న‌ది ఎండీ న‌ర్సింహారెడ్డి ఆరా తీశారు. ప‌నులు జ‌రుగుతున్న తీరును స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించిన ఆయ‌న నాణ్య‌త ప్ర‌మాణాల‌ను క‌చ్చితంగా పాటించాల‌ని కాంట్రాక్ట‌ర్ల‌ను ఆదేశించారు. ఎప్ప‌టిలోగా ప‌నులు పూర్తి అవుతాయ‌ని వారిని ఆరా తీశారు. ప‌నులను మ‌రింత వేగ‌వంతం చేసి నిర్ణీత గ‌డువులోగా పూర్తిచేయాల‌ని కాంట్రాక్ట‌ర్ల‌ను, నాణ్య‌తా ప్ర‌మాణాల‌ను పాటించేలా ప‌ర్య‌వేక్షించాల‌ని టీఎస్ ఐఐసీ జోన‌ల్ అధికారుల‌ను న‌ర్సింహారెడ్డి ఆదేశించారు. పారిశ్రామిక పార్కుల క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన టీఎస్ ఐఐసీ ఉన్న‌తాధికారుల బ్రందంలో ఎండీతో పాటు సీఈవో మ‌ధుసూద‌న్‌, డీజీఎం(అసెట్ మ్యానేజ్మెంట్‌) ఆర్ విఠ‌ల్, వ‌రంగ‌ల్ , క‌రీంన‌గ‌ర్ జోన‌ల్ మేనేజ‌ర్లు ర‌థ‌న్ రాథోడ్‌, అజ్మీర్ స్వామి , ఇత‌ర అధికారులు ఉన్నారు.

print

Post Comment

You May Have Missed