February 2023

అమ్మవారికి కొబ్బరికాయల సమర్పణ

శ్రీశైల దేవస్థానం:చైత్ర మాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారం రోజున ( ఏ రోజుముందుగా వస్తే ఆ రోజు) శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సంవత్సరం ఏప్రిల్ 11 న ఈ కుంభోత్సవం నిర్వహిస్తారు.…

హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 5,11,94,935/- నగదు రాబడి-ఈ ఓ లవన్న

శ్రీశైల దేవస్థానం:బుధవారం జరిగిన శ్రీశైల దేవస్థానం హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 5,11,94,935/- నగదు రాబడిగా లభించిందని ఈ ఓ ఎస్.లవన్న తెలిపారు.ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 13 రోజులలో (09.02.2023 నుండి 21.02.2023 వరకు) సమర్పించారని ఈ…

శాస్త్ర రీతిన పుష్పోత్సవం – శయనోత్సవం, ముగిసిన శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైల దేవస్థానం: ఫిబ్రవరి 11 నుండి నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగిసాయి. ఈ రోజు ఉదయం శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలను జరిపారు.అశ్వవాహన సేవ,ప్రాకారోత్సవం,పుష్పోత్సవం – శయనోత్సవం సంప్రదాయ కార్యక్రమాలతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం ఘనఘనంగా ముగిసాయి. వాహనసేవలో భాగంగా సాయంకాలం…

సంప్రదాయ రీతిన  అశ్వవాహన సేవ

శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల చివరి రోజు మంగళవారం ఉదయం శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలను జరిపారు. సంప్రదాయ రీతిన అశ్వవాహన సేవ: ఈ బ్రహ్మోత్సవాలలో , వాహనసేవలో భాగంగా ఈ రోజు సాయంకాలం శ్రీ స్వామిఅమ్మవార్లకు అశ్వవాహనసేవ జరిగింది. ఈ సేవలో…

శాస్త్రోక్తంగా పూర్ణాహుతి

శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో పదో రోజు సోమవారం ఉదయం శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి. శ్రీ స్వామివారి యాగశాల లో శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. రుద్రహోమం, చండీహోమం జరిపారు.తరువాత యాగ పూర్ణాహుతి, వసంతోత్సవం, అవబృథం, త్రిశూలస్నానం, కార్యక్రమాలు…

అందరి సమిష్టి కృషితోనే ఉత్సవాలు విజయవంతం, ధన్యవాదాలు- ఈ ఓ లవన్న

శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపటితో ( 21న ) ముగియనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకుగాను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పలు ప్రభుత్వశాఖ అధికారులు, వారి సిబ్బంది ప్రత్యేక విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న సోమవారం దేవస్థానం కార్యాలయ భవనం…

తెప్పోత్సవం మక్కువ గొలిపెను మనకోసం

శ్రీశైల దేవస్థానం: ఆదివారం రాత్రి 8.00గం.లకు శ్రీస్వామిఅమ్మవార్లకు తెప్పోత్సవం ఘనఘనంగా జరిగింది. ఆలయ పుష్కరిణి వద్ద ఈ తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించారు. తెప్పోత్సవ కార్యక్రమంలో ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచారపూజలు జరిపారు. తరువాత ఉత్సవమూర్తులను ఆలయ రాజగోపురం నుండి…

రథోత్సవం-భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యం

శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు తొమ్మిదో రోజు ఆదివారం శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి.యాగశాల లో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు జరిగాయి.అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం,…

పవిత్రంగా పాగాలంకరణ

శ్రీశైల దేవస్థానం: ప్రత్యేక కార్యక్రమాలు : లింగోద్భవకాల మహారుద్రాభిషేకం:శనివారం రాత్రి గం.10.00ల నుండి శ్రీస్వామివారికి లింగోద్భవకాల మహారుద్రాభిషేకం ప్రత్యేకం . నిష్ణాతులైన 11 మంది అర్చక స్వాములు మహాన్యాసపూర్వకంగా రుద్ర మంత్రాలను పఠిస్తుండగా, దాదాపు 4గంటలకు పైగా జ్యోతిర్లింగ స్వరూపుడైన శ్రీస్వామివారికి…