శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం,
అహోబిలం.
శ్రీ ప్రహ్లాదవరదుల వసంత వేడుకలు
(వసంతోత్సవం….2018)
వసంత ఋతువు వచ్చేసింది.మోడు బారిన చెట్లకు కొత్త చిగురు మొలకెత్తింది.కోయిల కూస్తున్నది.
జీవ నాయికలతో ఆటలాడుతూ పాటలుపాడుతూ ఆనంద సాగరంలో అందరితో ఓలలాడి కొత్త శోభ కలిగించుటకు c జరుపుకోబోతున్నారు.
శ్రీ ప్రహ్లాదవరదుల వసంత వేడుకలకు నాందిగా 10.04.2018 న శ్రీ కార్య ధురంధరులు,సర్వ సైన్యాధ్యక్షులు శ్రీ విశ్వక్సేనుల వారు అంకురార్పణం నిర్వహిస్తారు.
ఈ నెల 11.04.2018 నుండి 3 రోజుల పాటు దిగువ అహోబిలం లోని భాష్యకారుల సన్నిధి ప్రాంగణంలోని
మాధవి మంటపం(వసంత మంటపం)లో శ్రీ ప్రహ్లాదవరదులకు ప్రతిరోజు ఉదయం నవకలశ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
సాయంత్రం శ్రీ ప్రహ్లాదవరదులు వీణా నాద వినోదియై , మాధవి మంటపంలో ఆస్థాన తిరువారాధనలందుకొంటారు.రాత్రి ఆలయ సమీపంలోని వాసంతికా పుష్కరిణిలో జలకములాడి సేద తీరుతారు.
చివరి రోజు శ్రీ ప్రహ్లాదవరదులు ఆలయ తిరు మాడ వీధుల్లో అశ్వవాహనం పై విహరిస్తారు.అనంతరం స్వామి పుష్కరిణిలో అవభృత స్నానం తో వసంతోత్సవాలు ముగుస్తాయి.
చతుర్దశ భువనాధీశ్వరుడైనా అత్యంత సులభుడై ,మంచి గంధము మేనికి రాసుకొని, జీవ నాయికలైన మనతో ఆడి, పాడి ,ఆనందించి, కుంకుమ వసంతము చెల్లి మనలను అనుగ్రహించు విశేష ఉత్సవం శ్రీ ప్రహ్లాదవరదుల వసంతోత్సవం.
వేడుక వసంతపు వేళ యిదే
వాడల వాడల వనితలు ఆడి పాడేరు…….అన్నమయ్య
Sri Ahobila math paramparaadheena
Sri madAadivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthaanam, Ahobilam.
Sri Prahladhavaradula vasantha vedukalu
(Vasanthothsavam….2018)
Sri Prahladhavarada is going to celebrate vasanthothsavam with all the jeeva nayikas from 11.04.2018 to 13.04.2018 for three days.
As a part of vasanthothsavam ,
In the morning,nava kalasa thirumanjanam will be performed to sri Prahladhavarada in MADHAVI MANDAPAM.(vasantha mandapam)
In the evening sri Prahladhavarada enjoys the divine veena nadam.Asthana Thiruvaradhanam follows.
In the night sri Prahladhavarada,with chandanam and kunkuma vasantham applied to his thirumeni enjoys the ooral utsavam in vasanthika pushkarini.
On the last day of vasanthothsavam, sri Prahladhavarada taken in a Procession in Aswa vahanam.vasanthothsavam concludes with avabhruthasnanam.