శ్రీశైలం దేవస్థానం పరిధిలో ఈ నెల 20 న శంకర జయంతి కార్యక్రమాలు జరుగుతాయి .పాలధార ,పంచధారల వద్ద శంకర మందిరంలో ఉదయం 9 గంటలకు ప్రత్యేక పూజలు జరుపుతారు . ఆదిశంకరుల వారు పాలధార ,పంచధారల వద్ద కొంతకాలం తపస్సు చేసి ఇక్కడే శివానంద లహరి ని రచించారు . ఇందులో శ్రీశైల క్షేత్రాన్ని ,శ్రీ స్వామి అమ్మవార్లను ప్రస్తావించారు . సాయంత్రం 6.౩౦ కు ఆలయ దక్షిణ మాడ వీధిలో నోరి నారాయణ మూర్తి ,తెనాలి వారు ఆది శంకరుల జీవిత విశేషాలు , రచనలపై ప్రవచనం చేస్తారు .20న ఉదయం 7 గంటలకు ఆలయ ఈశాన్య భాగంలోని రుద్రవనంలో రుద్రమూర్తికి ప్రత్యేక పూజలు జరుపుతారు . గతంలో శంకర జయంతి రోజున ఈ రుద్రా విగ్రహాన్ని నెలకొల్పారు . ప్రతి ఏడాది శంకర జయంతి న ఇలా పూజలు జరుపుతారు .విశేష అభిషేకం , పూజలు చేస్తారు . రుద్రుని దృష్టి కృష్ణా నదిపై పడేవిధంగా విగ్రహాన్ని దేవస్థానం నెలకొల్పింది .మొత్తం 19 అడుగుల మేర నిర్మించారు .