×

20 ఏళ్లు భారత వాయుసేనలో మిగ్ ఎయిర్ క్రాఫ్ట్ పైలట్ గా సేవలందించిన శ్రీ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు యుద్ధం ఎప్పుడొచ్చినా తనను పిలిస్తే వెళ్ళడానికి సిధ్దం అంటున్నారు

20 ఏళ్లు భారత వాయుసేనలో మిగ్ ఎయిర్ క్రాఫ్ట్ పైలట్ గా సేవలందించిన శ్రీ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు యుద్ధం ఎప్పుడొచ్చినా తనను పిలిస్తే వెళ్ళడానికి సిధ్దం అంటున్నారు

20 ఏళ్లు భారత వాయుసేనలో మిగ్ ఎయిర్ క్రాఫ్ట్ పైలట్ గా సేవలందించిన శ్రీ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు యుద్ధం ఎప్పుడొచ్చినా తనను పిలిస్తే వెళ్ళడానికి సిధ్దం అంటున్నారు. భారత్ కు ప్రస్తుతం కష్టకాలమని, యుద్ధం దేనికీ పరిష్కారం కాదని చెబుతున్నారు. అయితే అస్థిర పాకిస్థాన్ తో యుద్ధం వచ్చే పరిస్థితులు నెలకొన్నాయని, పాకిస్థాన్ ఎప్పుడు ఎలా స్పందిస్తుందో చెప్పడం కష్టమని అన్నారు. యుద్ధం ఎప్పుడు వచ్చినా అంతా సర్వసన్నద్ధంగా ఉండాలన్నారు. తనను పిలిస్తే మళ్ళీ విధుల్లో చేరతానంటున్నారు.

యుద్ధం వస్తే… అవసరం అయితే ఏ క్షణమైనా విధుల్లో జాయిన్ అయ్యేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. దేశానికి సేవ చేయడం కంటే భాగ్యం ఏముంటుందని వారు అన్నారు. రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన ఏదీ మర్చిపోయానని అనుకోవద్దని, ఈ క్షణంలో అయినా విధుల్లో చేరేందుకు సిద్ధమని ఆయన తెలిపారు. రాజకీయాల్లోనే కాదు….దేశరక్షణలోనూ తాను ముందుంటానని నిరూపించారు. లక్షిత దాడుల నేపథ్యంలో శ్రీ. ఉత్తమ్ గారి వ్యాఖ్యలు యావత్ తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిని ఇస్తున్నాయి.

print

Post Comment

You May Have Missed