మనోహరంగా బ్రహ్మచారిణి అలంకారం, మయూర వాహనసేవ

 శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దసరా మహోత్సవాలలో భాగంగా రెండవ రోజైన మంగళవారం  ఉదయం అమ్మవారికి ప్రాత:కాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్ఠానాలు, పారాయణలు, సూర్య నమస్కారములు, చండీహోమం, పంచాక్షరి, భ్రామరి, బాలా జపానుష్ఠానములు, చండీపారాయణ, చతుర్వేద పారాయణలు, కుమారీ పూజలు జరిగాయి.రుద్రహోమం, రుద్రయాగాంగ జపములు, రుద్ర పారాయణలు జరిగాయి. ఈ సాయంకాలం జపములు, పారాయణలు, నవావరణార్చన, కుంకుమార్చన, చండీ హోమం జరిపారు.

ఈ రోజు రాత్రి 9.00గంటల నుండి కాళరాత్రిపూజ, అమ్మవారి ఆస్థాన సేవ, సువాసినీ పూజలు జరిగాయి.

కుమారి పూజ దసరా మహోత్సవాలలో భాగంగా ప్రతీరోజు కుమారి పూజలు నిర్వహిస్తున్నారు.

 కుమారి పూజలో రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వయస్సు ఉన్న బాలికలను పూలు, పండ్లు, నూతన వస్త్రాలను సమర్పించి పూజిస్తున్నారు. కుమారి పూజ నవరాత్రి ఉత్సవాలలో ఒక ముఖ్యమైన సంప్రదాయం.

బ్రహ్మచారిణి అలంకారం:

ఈ నవరాత్రి మహోత్సవాలలో నవదుర్గ అలంకారంలో భాగంగా సాయంత్రం శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తిని బ్రహ్మచారిణి స్వరూపంలో అలంకరింపచేసారు.నవదుర్గలలో ద్వితీయ రూపమైన ఈ దేవిని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలగగడంతో పాటు సర్వత్రా విజయాలు లభిస్తాయి. బ్రహ్మచారిణి ఉపాసన వలన త్యాగ, వైరాగ్య భావాలు కలుగుతాయని దేవీ భాగవతంలో చెప్పబడింది. అందుకే ఈ స్వరూపాన్ని సిద్ధులు, యతులు ఎక్కువగా ఉపాసిస్తారు.ఈ దేవిని పూజించడం వలన మానసిక ఒత్తిళ్లు తొలగిపోతాయి. ద్విభుజురాలైన ఈ దేవి కుడి చేతిలో జపమాల, ఎడమచేతిలో కమండలాన్ని ధరించి ఉంటుంది.

మయూర వాహనసేవ:

  ఈ ఉత్సవాలలో శ్రీ స్వామి అమ్మవార్లకు నిర్వహిస్తున్న వాహన సేవలలో భాగంగా ఈ రోజు మయూర వాహనసేవ జరిపారు. ఈ వాహనసేవలో శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరింపజేసి, మయూరవాహనంపై వేంచేపు చేయించి పూజాదికాలు చేసారు. ఘనంగా గ్రామోత్సవం జరిగింది.

దేవస్థానం బోర్డు చైర్మన్ , సభ్యులు, ఈ ఓ , పలువురు అధికారులు ,సిబ్బంది, అనేక మంది భక్తులు పాల్గొన్నారు. అర్చక స్వాములు పూజలు జరిపారు.

print

Post Comment

You May Have Missed