
శ్రీశైల దేవస్థానం:దసరా మహోత్సవాలలో భాగంగా రెండవ రోజైన మంగళవారం ఉదయం అమ్మవారికి ప్రాత:కాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్ఠానాలు, పారాయణలు, సూర్య నమస్కారములు, చండీహోమం, పంచాక్షరి, భ్రామరి, బాలా జపానుష్ఠానములు, చండీపారాయణ, చతుర్వేద పారాయణలు, కుమారీపూజలు జరిగాయి.అనంతరం రుద్రహోమం, రుద్రయాగాంగ జపములు, రుద్ర పారాయణలు జరిపారు. అదేవిధంగా ఈ సాయంకాలం జపములు, పారాయణలు, నవావరణార్చన, కుంకుమార్చన, చండీ హోమం జరిగాయి.
ఈ రోజు రాత్రి 9.00గంటల నుండి కాళరాత్రిపూజ, అమ్మవారి ఆస్థాన సేవ, సువాసినీపూజలు ప్రత్యేకం.
కుమారి పూజ:
దసరామహోత్సవాలలో భాగంగా ప్రతీరోజు కుమారి పూజలు నిర్వహిస్తున్నారు. కుమారి పూజలో రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వయస్సు ఉన్న బాలికలను పూలు, పండ్లు, నూతన వస్త్రాలను సమర్పించి పూజించడం జరుగుతోంది. కుమారిపూజ నవరాత్రి ఉత్సవాలలో ఒక ముఖ్యమైన సంప్రదాయం
బ్రహ్మచారిణి అలంకారం:
ఈ నవరాత్రి మహోత్సవాలలో , నవదుర్గ అలంకారంలో భాగంగా సాయంత్రం శ్రీ అమ్మవారి ఉత్సవ మూర్తిని బ్రహ్మచారిణి స్వరూపంలో అలంకరించారు.
నవదుర్గలలో ద్వితీయ రూపమైన ఈ దేవిని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలగగడంతో పాటు సర్వతా విజయాలు లభిస్తాయి. బ్రహ్మచారిణి ఉపాసన వలన త్యాగ, వైరాగ్య భావాలు కలుగుతాయని దేవీ భాగవతంలో విశేషం. అందుకే ఈ స్వరూపాన్ని సిద్ధులు, యతులు ఎక్కువగా ఉపాసిస్తారు.ఈ దేవిని పూజించడం వలన మానసిక ఒత్తిళ్లు తొలగిపోతాయి. ద్విభుజురాలైన ఈ దేవి కుడిచేతిలో జపమాల, ఎడమచేతిలో కమండలాన్ని ధరించి ఉంటుంది.
:
ఈ ఉత్సవాలలో శ్రీ స్వామిఅమ్మవార్లకు , వాహనసేవలలో భాగంగా ఈ రోజు మయూర వాహనసేవ నిర్వహించారు. ఈ వాహనసేవలో శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరింపజేసి, మయూర వాహనంపై వేంచేపు చేయించి పూజాదికాలు జరిపారు. అనంతరం గ్రామోత్సవం ఉల్లాసంగా జరిగింది.
ఈ ఓ పర్యవేక్షణలో వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అర్చక స్వాములు చక్కగా పూజలు నిర్వహిస్తున్నారు.