×

తెలంగాణ సాహితీ చరిత్రను పునర్నిర్మించుకోవాలి

తెలంగాణ సాహితీ చరిత్రను పునర్నిర్మించుకోవాలి

సాహిత్య అకాడమీ, రవీంద్రభారతి: తెలంగాణ సాహితీ చరిత్రను పునర్నిర్మించుకోవాల్సిన అవసరముందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డా.నందిని సిధారెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సాహితీవేత్తలు కవులు కీలక పాత్ర పోషించారని అన్నారు.
బుధవారం  రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రచురణల పరిచయ సభలో నందిని అధ్యక్షోపన్యాసం చేశారు. ఇటీవల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆవిష్కరించుకున్న పలు ప్రచురణల గురించి సమీక్షించుకునే ఉద్దేశంతో ఈ పరిచయ సభ నిర్వహిస్తున్నామన్నారు.ఈ సందర్భంగా ఉదయం, మధ్యాహ్నం రెండు దఫాలుగా నిర్వహించిన గ్రంథ పరిచయ సభలో 13 పుస్తకాలను సాహితీ వేత్తలు పరిచయం చేశారు.ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్, సాహిత్య అకాడమీ కార్యదర్శి డా.ఏనుగు నరసింహారెడ్డి,మల్లెగోడ గంగా ప్రసాద్,  శివకుమార్, రచయిత సుగిలి సుధారాణి, డా.బాలశ్రీనివాసమూర్తి, పలువురు రచయితలు, తదితరులు పాల్గొన్నారు.

ప్రచురణల వివరాలు :

డా.జి. అంజయ్య – శాతవాహనుల నుండి కాకతీయుల వరకు
గురిజాల రామశేషయ్య – తెలంగాణ పద్యకవితా వైభవం
కె.పి. అశోక్ కుమార్ – మూడు తరాల తెలంగాణ కథ
భుజంగరెడ్డి – తెలంగాణ సామెతలు
ఆచార్య వెలుదండ నిత్యానందరావు – తెలంగాణ నవలా వికాసం
చంద్రబోసు – తెలంగాణ సినీ గేయ వైభవం
హరగోపాల్ – తెలంగాణలో శాతవాహనుల వారసత్వం
మల్లెగోడ గంగాప్రసాద్ – తెలంగాణలో భావకవితా వికాసం
వఝల శివ కుమార్ – తొలినాళ్ళ సోయి
శ్రీమతి సగిలి సుధారాణి – గొండ్వానా లాండ్ ఎంత ప్రాచీనమైనదో తెలుగు కూడా అంతే ప్రాచీనమైనది
డా. బాల శ్రీనివాస మూర్తి – మాదిరాజు రామకోటేశ్వర రావు స్వీయ చరిత్ర
డా. పగడాల నాగేందర్ – ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కవిత్వం
భాస్కర్ యోగి – ఈగ బుచ్చిదాసు (సంకీర్తనలు – శతకము – బతుకమ్మ పాట)

 

print

Post Comment

You May Have Missed