శనివారం ఉదయం ఇంజనీర్-ఇన్-చీఫ్ (R&B) కార్యాలయం లో జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, గణపతి రెడ్డి, ఇ-ఇన్-సి ఇతర రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు. నూతన కలక్టరేటుల నిర్మాణం, గెస్ట్ హౌస్ ల నిర్మాణం, శాసన సభ్యుల వసతి, ఇతర భవనాల నిర్మాణం వంటి పనులలో ఇంకా మొదలు కాని భూసేకరణ, స్థలాల గుర్తింపు వంటి జాప్యాలు మొదలైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
- నియోజకవర్గాలలోశాసన సభ్యుల కార్యాలయం-వసతి నిర్మాణం జాప్యం పై ఆరా తీసిన మంత్రి తుమ్మల. ఇంకా కొన్ని చోట్ల నిర్మాణం ప్రారంభం కాకపోవటం వలన అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి తుమ్మల అసంతృప్తి వ్యక్తం చేసారు .