ముక్కోటి ఏకాదశి పర్వదినాన శ్రీశైలం దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు వివిధ ఉత్సవాలు జరిగాయి . వేకువజాము స్వామి అమ్మవార్ల ఉత్తర ద్వారా దర్శనం జరిగింది. అనంతరం రావణ వాహన సేవ , గ్రామోత్సవం నిర్వహించారు. శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు స్వామి వారి ఆలయ ముఖ మండపంలో ప్రత్యేక పూజలు జరిపారు . ఉత్తర ద్వారం నుంచి వెలుపలికి తోడ్కొని వచ్చి భక్తులకు ఉత్తర ద్వార దర్శనానానికి అవకాశం కల్పించారు. అనంతరం ఉదయం ఆరు గంటలకు రావణ వాహనంపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేయించి గ్రామోత్సవం జరిపారు .