డిమానిటైజేషన్, జీఎస్టీ వంటి కఠిన నిర్ణయాలు, పెట్రో ధరల పెంపు, రూపాయి విలువ పతనం వంటి తీవ్ర సమస్యలతో దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడమే కాకుండా ఇవన్నీ రాష్ట్ర ఆర్థిక వ్వవస్థను ప్రభావితం చేశాయి.
ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేక హోదా రాష్ట్రంగా ప్రకటించాలి.
పొరుగు రాష్ట్రాల స్థాయికి చేరుకునే వరకు కేంద్రం చేయూతనివ్వాలి.
14వ ఆర్థిక సంఘాన్ని అడ్డంపెట్టుకుని కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకుండా తప్పించుకుంటోంది. మరోపక్క ఈశాన్య, పర్వత ప్రాంత రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను కొనసాగిస్తోంది.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ15వ ఆర్థిక సంఘం కేంద్రానికి సిఫారసు చేయాలి.
అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలు, సామాజిక మౌలిక సదుపాయాలు, ఇతర ముఖ్య సదుపాయల ఏర్పాటుకు రూ.1,09,023 కోట్లు ఖర్చు కాగలదని అంచనా.
ప్రధాన ప్రాంత అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.39,937 కోట్లు అవసరం కాగా, కేంద్ర ప్రభుత్వం అందులో రూ.2,500 కోట్లు ఇస్తామని చెప్పి, 2014-16 కాలానికి రూ.1500 కోట్లు మాత్రమే అందించింది. నీతి ఆయోగ్ సూచించినప్పటికీ రూ.1000 కోట్లు విడుదల చేయలేదు.
రాజధాని మౌలిక అవసరాలకు 15వ ఆర్థిక సంఘం రూ.37,437 కోట్లు కేటాయిస్తుందని ఆశిస్తున్నాం.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఉద్దేశించిన గ్రాంటులో 15వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి రూ.22,250 కోట్లు సిఫారసు చేస్తుందని ఆశిస్తున్నాం.
పోర్టులు, ఎయిర్ పోర్టులకు రహదారుల అనుసంధానం కోసం 15వ ఆర్థిక సంఘం రూ.10 వేల కోట్లు కేటాయించాలని కోరుతున్నాం.
ప్రకృతి వైపరీత్యాల్లో పంట నష్టాలకు ఉపశమనం కింద జరిపే కేటాయింపుల్లో విధి విధానాల్లో మార్పు చేయాల్సిన అవసరం వుంది. పంట నష్టాలను అంచనా వేయడంలో వ్యవసాయ పెట్టుబడుల వాస్తవ గణాంకాలను పరిగణనలోకి తీసుకోవాలని 15వ ఆర్థిక సంఘాన్ని కోరుతున్నాం.