సిద్దిపేట పట్టణంలో హెచ్ సీఏ ఆధ్వర్యంలో ప్రారంభమైన టి-20 క్రికెట్ లీగ్ మ్యాచులు ఉత్సాహంగా సాగుతున్నాయి. శనివారం రంగారెడ్డి రైడర్స్, నిజామాబాద్ నైట్స్ జట్ల మధ్య జరిగిన పోటీలో 13 పరుగుల ఆధిక్యంతో రంగారెడ్డి రైడర్స్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో విజేత జట్టు పక్షాన ఆడిన సినీనటుడు అక్కినేని అఖిల్ కేవలం ఒక్క పరుగు చేసి వెనుతిరగటం అభిమానులను నిరుత్సాహ పరిచింది. ఆదివారం జరిగే మ్యాచ్ తో టి-20 మూడు రోజుల లీగ్ మ్యాచులు ముగుస్తాయి.
– చైతన్య, గజ్వేల్.