12వ తేదీన లెక్కింపులో శ్రీశైల దేవస్థానం హుండీల రాబడి రూ.3,33,39,987 గా నమోదు అయినట్లు దేవస్థానం సంబంధిత అసిస్టెంట్ కమిషనర్ మీడియా కు సమాచారం ఇచ్చారు. బుధవారం కూడా లెక్కింపు వుంటుంది. మంగళవారం కుమారస్వామి పూజలు, వీరభద్రస్వామి పూజలు, నందీశ్వర పూజలు ఘనంగా జరిగాయి. అర్చక స్వాములు సంప్రదాయపరంగా నిర్వహించారు.