రాష్ట్రపతిగా ఎన్నికైన శ్రీ రామ్నాథ్ కొవింద్కు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో మరింత ముందుకు పోతుందనే ఆశాభావాన్ని సీఎం వ్యక్తం చేశారు. భారత దేశ ప్రజాస్వామ్య, ఫెడరల్ స్ఫూర్తిని కొనసాగించడంలో రామ్నాథ్ సంపూర్ణ విజయం సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.