పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానంలో శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి ఊయలసేవ
శ్రీశైలం: లోకకల్యాణం కోసం పౌర్ణమిని పురస్కరించుకుని దేవస్థానం ఈ రోజు (09.03.2020) సాయంకాలం శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి ఊయల సేవను నిర్వహించింది.
ప్రతి శుక్రవారం రోజు మరియు పౌర్ణమి, మూలనక్షత్రం రోజులలో ఈ ఊయలసేవ జరిపించబడుతోంది.ఈ సాయంత్రం గం. 7.30ల నుండి ఈ ఊయలసేవ నిర్వహించబడుతుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠించారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపించారు.
అనంతరం ఊయలలో వేంచేబు చేయించిన శ్రీస్వామిఅమ్మవార్లకు శాస్తోక్తంగా షోడశోపచార పూజ జరిపించారు.
ఆ తరువాత విశేషంగా అమ్మవారికి అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల, సహస్ర నామపూజలు, స్వామివారికి సహస్రనామార్చన పూజలు జరిపించబడుతాయి. చివరగా ఊయల సేవ నిర్వహించారు.
ఊయల సేవను పురస్కరించుకుని శ్రీస్వామి అమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు జరిపించారు. అదేవిధంగా శ్రీస్వామిఅమ్మవార్లను వేంచేబు చేసి ఊయలను కూడా శోభయమానంగా అలంకరించారు.
పుష్పాలంకరణకు గాను గులాబీలు, తెల్లచామంతి, పసుపు చామంతి, ఊదారంగు చామంతి, ఎర్రబంతి, పసుపుబంతి, మల్లెలు, కనకాంబరాలు, గన్నేరు, దేవగన్నేరు, నందివర్ధనం, గరుడవర్ధనం,
మొదలైన పలు రకాల పుష్పాలను వినియోగించారు. అదేవిధంగా ఊయలకు కూడా విశేషపుష్పాలంకరణ చేయడం జరుగింది.
కాగా ఈ ఊయల సేవలో భక్తులందరూ పాల్గొనే అవకాశం కల్పించారు. ముత్తైదువలు స్వయంగా శ్రీస్వామిఅమ్మవార్ల ఊయలను ఊపే అవకాశాన్ని కూడా దేవస్థానం కల్పించారు.