హరిత తెలంగాణ సాధనకు విద్యార్థులు ముందుండాలి : మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
హరిత తెలంగాణ సాధనకు విద్యార్థులు ముందుండాలి : మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో విద్యార్థులు పాల్గోని ,విజయవంతం చేయాలని గృహ నిర్మాణ,న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హరితహారం’లో భాగంగా సోన్ మండలం లెప్ట్ పోచంపహాడ్ లోని సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విద్యార్థినిలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ..అంతరించిపోతున్న అడవులను పరిరక్షించేందుకు హరితహారం కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. హరిత తెలంగాణ రూప కల్పనలో విద్యార్థులు ముందుండలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శి సత్యనారయణ గౌడ్, ప్రిన్సిపల్ గంగన్న, పలువురు ప్రజా ప్రతినిదులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.