తిరుమల,సెప్టెంబరు 18: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన మంగళవారం ఉదయం హనుమంత వాహనసేవలో రెండు ఆధ్యాత్మిక పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి సుధా నారాయణమూర్తి, ఆలయ డెప్యూటి ఈఓ హరీంద్రనాథ్, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి ఆంజనేయులు, ఉప సంపాదకులు డా|| నొస్సం నరసింహాచార్య ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.పురాణ వాఙ్మయం – డా. విష్ణుభట్ల గోపాలకృష్ణమూర్తి,రామోపాఖ్యానం(భారత ఉపాఖ్యాన గ్రంథమాల) పుస్తకాలను ఆవిష్కరించారు.