ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం వివిధ పార్టీలు ,సంస్థలు ఇచ్చిన బంద్ పిలుపు విజయవంతమైంది . ప్రజలు స్వచ్ఛందంగా బంద్ కు సహకరించారు . ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి . వివిధ పార్టీలు ధర్నాలు చేసాయి . ఊరేగింపులు నిర్వహించారు . బంద్ పూర్తిగా జరిపినందుకు అన్ని వర్గాలవారికి నాయకులు ధన్యవాదాలు తెలిపారు .