ఆఫ్రికా ఖండం లోని వివిధ దేశాలకు చెందిన 28 మంది జర్నలిస్టుల బృందం గురువారం హైదరాబాద్ కు చేరుకుంది. భారత దేశ పర్యటనలో భాగంగా విదేశి వ్యవహారాల శాఖ, ఎక్స్ టర్నల్ పబ్లిసిటీ డివిజన్ అండర్ సెక్రటరీ ఫకృద్దీన్ అలీ అహ్మద్ఆధ్వర్యంలో ఈ బృందం హైదరాబాద్ లో ఈ నెల 24 వరకు పర్యటించనుంది. అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం (గురువారం) చారిత్రాత్మకమైన చార్మినార్ ను సందర్శించింది. ఆ కట్టడo విశేషాలను సంబంధిత శాఖాధికారులు వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అర్వింద్ కుమార్ ఆదేశాల మేరకు అదనపు సంచాలకులు నాగయ్య కాoబ్లే, జాయింట్ డైరెక్టర్ డి.ఎస్. జగన్ , డిప్యూటి డైరెక్టర్ డి.శ్రీనివాస్ , ఆసిస్టెంట్ డైరెక్టర్ లు రాజా రెడ్డి, బిమల్ దేవ్ తదితరులు ఈ బృందం వెంట ఉన్నారు.
ఈ జర్నలిస్టుల బృందం ఈ నెల 22వ తేది శుక్రవారం గచ్చిబౌలి లోని టి-హబ్, రాజ్ భవన్ లోని సోలార్ పవర్ యునిట్ లను, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ను, 23 వ తేదిన బాలానగర్ లోని నేషనల్ ఇన్ స్టిస్ట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ సెంటర్ ను, శామీర్ పేటలోని జినోమ్ వ్యాలీని, లింగంపల్లిలోని బి.హెచ్.ఇ.ఎల్ ను , గోల్కొండ ఫోర్ట్ ను దర్శించి 24 వ తేదిన ఉదయం ఆఫ్రికా దేశాలకు బయలుదేరి వెళుతుంది.