హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో నిర్మాణంలో వున్న భవనం కూలి ప్రాణాపాయం సంభవించడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.