భీమా ఎత్తిపోతల ప్రారంభోత్సవం..!
పాలమూరు జిల్లాలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. స్వరాష్ట్రంలో సాగునీటి తొలి ఫలితాన్ని జిల్లా ప్రజలు అందుకుంటున్నారు. భీమా ఎత్తిపోతల పథకంలో భాగంగా ఇవాళకాలువను రామన్‌పాడు ప్రారంభించారు. ఈమేరకు ఆత్మకూరు మండలం నందిమలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాలువకు మంత్రి హరీష్‌రావు ప్రారంభోత్సవం చేశారు.మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు. జూరాల నుంచి నీళ్లు రామన్ పాడుకు చేరుకున్నాయి. భీమా ఎత్తిపోతల ద్వారా లక్షా 40 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.
<
>