బీబీ నగర్ నిమ్స్ కి స్ట్రెచర్లు, వీల్ చైర్ల బహూకరణ
ఉదారతను చాటుకున్న SBI
స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా మలక్పేట్, సైదాబాద్ శాఖలు తమ ఉదారతను చాటుకున్నాయి. బీబీ నగర్ నిమ్స్ హాస్పిటల్ కి 35 స్ట్రెచర్లు, 25 వీల్ chairs ని బహుకరించాయి. సంబంధిత బ్యాంకు శాఖల అధికారులు శనివారం బీబీ నగర్ నిమ్స్ హాస్పిటల్ లో వాటిని, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కే. మనోహర్ చేతుల మీదుగా హాస్పిటల్ కి అందచేశారు. ఈ సందర్బంగా నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ, స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా మలక్పేట్, సైదాబాద్ శాఖలను అభినందించారు. ఇలాంటి దాతలతో ప్రభుత్వ వైద్యం మరింత పటిష్టం అవుతుందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు, దాతల అండదండలు ఉంటె, ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చు అన్నారు. నిర్మాణం చివరి అంకంలో ఉన్న బీబీ నగర్ నిమ్స్ హాస్పిటల్ కి స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా మలక్పేట్, సైదాబాద్ శాఖలు ఇచ్చిన స్ట్రెచర్లు, వీల్ chairs ఎంతగానో ఉపయోగ పడతాయని అభినందించారు.