సీఎం చొరవతో నాణ్యమైన రహదారుల నిర్మాణాలు – మంత్రి తుమ్మల

సీఎం చొరవతో నాణ్యమైన రహదారుల నిర్మాణాలు చేపట్టామని రాష్ట్ర రహదారులు,  భవనాల శాఖ మంత్రి  తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు .ఈ రోజు  ఉదయం  తెలంగాణ రాష్ట సచివాలయం “డి – బ్లాక్” గ్రౌండ్ ఫ్లోర్ సమావేశ మందిరం లో మంత్రి తుమ్మల మీడియా వారితో  మాట్లాడారు . ఈ సమావేశ౦లో హైదరాబాద్ నగర మేయర్  బొంతు రాంమోహన్, ఇంజనీర్–ఇన్–చీఫ్  ఐ.గణపతి రెడ్డి,  యం.లింగయ్య , పి.సతీష్ , ఇతర  అధికారులు పాల్గొన్నారు   

 ముఖ్య అంశాలు:

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి  2,527 కి.మీ నిడివిగల 15 జాతీయ రహదారులు ఉన్నాయి . రాష్ట్ర జాతీయ రహదారుల సాంద్రత 2.2 KM/100. జాతీయ రహదారుల జాతీయ సగటు 2.84 KM/100.    ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్ర శేఖర రావు బంగారు తెలంగాణా సాధనకు మౌలిక సదుపాయాల అవసరాన్ని అందునా నాణ్యమైన రహదారుల నిర్మాణాన్ని  గుర్తెరిగి జాతీయ రహదారుల నిర్మాణానికి నడుం బిగించారు. పలుమార్లు కేంద్రానికి వినతులు లేఖలు రాసి ఎన్నో రహదారులను సాధించుకునేలా చేసారు. కె.సి.ఆర్ నేతృత్వంలో  మంత్రితుమ్మల నాగేశ్వర రావు కృషి మేరకు కేంద్రం నుంచి చాలా   అనుమతులు వచ్చాయి . జాతీయ రహదారుల సాంద్రత 4.1/100 గా అభివృద్ధి చెందింది. గత నాలుగు సంవత్సరాల కాలంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి  గడ్కారి  సౌజన్యంతో 3,155 కి.మీ నిడివి గల జాతీయ రహదారులు తెలంగాణా రాష్ట్రానికి ఏర్పడ్డాయి.    

గత నాలుగు సంవత్సరాలలో చేపట్టిన జాతీయ రహదారుల పనులు

సంవత్సరం రాష్ట్ర NH విభాగం చేపట్టినవి NHAI విభాగం చేపట్టినవి మొత్తం తెలంగాణా ప్రాజెక్టులు
సం. నిడివి కి.మీ. అంచనా సం. నిడివి కి.మీ. అంచనా సం. నిడివి కి.మీ. అంచనా
2014-15 8 159.73 738.50 0 0 0 8 159.73 738.50
2015-16 13 207.07 740.83 1 99.10 1905.00 14 306.17 2645.83
2016-17 11 442.87 2634.86 0 0 0 11 442.87 2634.86
2017-18 12 311.58 3030.00 4 188.35 3439.00 16 499.93 6469.00
మొత్తం 44 1121.00 7144.00 5 287.50 5344.00 49 1408.00 12488.00

 

ఒక్క 2017-18 ఆర్ధిక సంవత్సరంలో మంజూరు అయిన పనులు

క్ర.సం. రహదారి పనుల వివరాలు నిడివి కి.మీ. అంచనా కొట్లలో
1 Widening to two lane with paved shoulder from Km 125/242 to 137/604 of NH-150 on Kalaburgi-Yadgiri-Krishna road 12.240 34.76
2 Reconstruction of minor bridge at Km 65/4-6 on NH-63 under NH(O) 1.000 5.83
3 Construction of Flyover at Amberpet X road from Km 1/725 to Km 3/185 on NH-163 1.465 186.71
4 Rehabilitation and Upgradation of NH 765D from Hyd ORR to Medak to 2/4 Lane with paved shoulders 62.920 426.52
5 Six Laning from Aramgarh to Shamshabad portion of Hyderabad – Bangalore section  of NH-44 10.048 283.15
6 Widening and Strengthening of existing 2 lane to 2 lane with paved shoulders from   km.159/0 to 165/4 & 186/0 to 215/0  of Hyd-Bhoopalapatnam section of NH 163

 

35.400 230.03
7 Widening and Strengthening of existing 2 lane to 2 lane with paved shoulders from Km 25/0 to Km 59/2 on Sironcha-Atmakur section of  NH-353C 34.200 206.13
8 Rehabilitation and Up gradation from Mallepally– Haliya section of NH-167 to 2/4 lane with paved shoulders 40.579 294.13
9 Rehabilitation and Up gradation from Alinagar-Miryalaguda section of NH-167 to 2/4 lane with paved shoulders 30.016 220.28
10 Rehabilitation and Up gradation from Miryalaguda-Kodad section of NH-167 to 2/4 lane with paved shoulders 46.711 322.81
11 6 lane elevated corridor  from Km 7/950 (Uppal) to 14/200 of Hyd- Bhoopalapatnam section of NH-163 6.250 626.76
12 Rehabilitation and Up gradation from Km. 121/0 to 154/0 of Nakarekal – Mallampally section of NH-365 to two lane with Paved shoulders 33.000 192.67
13 Four laning of NH-161 from Kandi to Ramsanpalle  under Bharatmala Pariyojana on EPC Mode

 

39.98 857.62
14 Four laning of NH-161 from Ramsanpalle to Mangloor  under Bharatmala Pariyojana on Hybrid Annuity 46.81 950.63
15 Four laning of NH-161 from Mangloor to Telangana/Maharastra border  under Bharatmala Pariyojana on Hybrid Annuity 48.96 802.65
16 Repallewada to Telangana / Maharashtra Border  of Mancherial-Chndrapur section of NH-363 on EPC

 

52.60 828.29
  TOTAL 500.00 6469.00

 

నితిన్ గడ్కారి హైదరాబాద్ లో  మే 5 న  పర్యటన లో  ఈ కింది రహదారులను రాష్ట్రం చేపట్టనున్నది.

  • కార్యక్రమాలు
    • హైదరాబాద్-o ఓ.ఆర్.ఆర్ నుండి మెదక్ సెక్షన్ NH-765D జాతీయ రహదారి పై కి.మీ. 15/97 నుండి కి.మీ 78/70 వరకు (92 కి.మీ.నిడివి గల రహదారిని రెండు వరుసలు + శోల్దర్స్) ఇ.పి.సి. ప్రాతిపదికన నిర్మాణం అంచనావిలువ రూ. 426.52 కోట్లు. 

ప్రయోజనాలు హైదరాబాద్ – నర్సాపూర్ – కౌడిపల్లి – అప్పాజిపల్లీ – రాంపూర్ – మెదక్ పట్టణాల మధ్య అనుసంధానం, ప్రయాణ సమయంలో ఆదా, 

 హైదరాబాద్ బెంగుళూరు NH-44 జాతీయ రహదారి పై ఆరంగడ్శంషాబాద్ సెక్షన్ 9/9 నుండి 19/948 కి.మీ మధ్య (10.048 కి.మీ.నిడివి గల రహదారిని ఆరు వరుసలు) ఇ.పి.సి. ప్రాతిపదికన అభివృద్ధి అంచనా విలువ రూ.15 కోట్లు. కాంట్రాక్టర్ 

ప్రయోజనాలు హైదరాబాద్ – బెంగుళూరు మధ్య ఆరంగడ్శంషాబాద్ సెక్షన్ లోఉన్న రహదారిపై విమానాశ్రయం  వెళ్ళే విపరీతమైన ట్రాఫిక్ ఒత్తిడిని నివారించేందుకు ఉద్దేశించిన నిర్మాణం. మధ్య మధ్య మూడు ఫ్లై-ఓవర్లతో,  1.2 కి.మీ నిడివి గల ఎలివేటెడ్ కారిడార్ వంటి అధునాతన సదుపాయాలు, ప్రయాణ సమయంలో ఆదా, రహదారి భద్రతకు ప్రాముఖ్యత, ట్రాఫిక్ జాంలు, కాలుష్యం లేకుండా పర్యావరణహితంగా  రూపకల్పన.

  • అంబర్ పేట్ కూడలి వద్ద నాలుగు వరుసల ఫ్లై – ఓవర్ – హైదరాబాద్-భూపాలపట్నం NH-202 జాతీయ రహదారి పై ఇ.పి.సి. ప్రాతిపదికన 465 కి.మీ నిడివి గల నాలుగు వరుసల ఫ్లై – ఓవర్ నిర్మాణం అంచనావిలువ రూ. 186.71 కోట్లు. ఛే (6) నెంబర్ కూడలి,  శ్రీ రమణ కూడలి వద్ద నిత్యం జరుగుతున్న ట్రాఫిక్ జామ్ లను ఎదుర్కొనేందుకు ప్రతిపాదించారు .

ప్రయోజనాలు హైదరాబాద్ – భూపాలపట్నం NH-202 జాతీయ రహదారి పై హైదరాబాద్ నుండి వరంగల్ వైపు వెళ్ళే విపరీతమైన ట్రాఫిక్ ఒత్తిడిని నివారించేందుకు, హైదరాబాద్ నగరంలో కోటి ఉప్పల్ మధ్య ఉన్న సిటీ ట్రాఫిక్ ను నియంత్రించేందుకు ఉద్దేశించిన నిర్మాణం. 1.465 కి.మీ నిడివి గల ఫ్లై-ఓవర్, ప్రయాణ సమయంలో ఆదా, రహదారి భద్రతకు ప్రాముఖ్యత, నగరంలో తరచూ ఏర్పడే ట్రాఫ్ఫిక్ జాంలు నివారించి నగర పౌరులకు చక్కటి ప్రయాణ సదుపాయాన్ని కల్పించడం, కాలుష్యం లేకుండా పర్యావరణహితంగా ఉండే విధంగా రూపకల్పన.

  • ఉప్పల్ పట్టణ ప్రాంతంలో హైదరాబాద్-భూపాలపట్నం NH-202 జాతీయ రహదారి పై 25 కి.మీ. నిడివి గల ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్ ఇ.పి.సి. ప్రాతిపదికన నిర్మాణం అంచనావిలువ రూ. 626.76 కోట్లు, ఈ నిర్మాణ ఖర్చు కేంద్ర భరిస్తుండగా, కాగా భూసేకరణకు కానున్న రూ.768.26 కోట్ల ఖర్చును తెలంగాణా రాష్ట్రమే పూర్తిగా భరించనున్నది.

 

ప్రయోజనాలు హైదరాబాద్ – భూపాలపట్నం NH-202 జాతీయ రహదారి పై హైదరాబాద్ నుండి వరంగల్ వైపు వెళ్ళే విపరీతమైన ట్రాఫిక్ ఒత్తిడిని నివారించేందుకు, హైదరాబాద్ నగరంలో ఉప్పల్ ప్రాంతంలో ఉన్న సిటీ ట్రాఫిక్ ను నియంత్రించేందుకు ఉద్దేశించిన నిర్మాణం. ఉప్పల్ జంక్షన్, ఉప్పల్ బస్సు స్టాండ్, గాంధీ నాగర్, బుద్ధానగర్, నల్లచెరువు, మేడిపల్లి, బోడుప్పల్, c CPRI వరకు పొడవుగా ఉండే ఈ నిర్మాణం ఆయా ప్రాంతాలలో తరచుగా ఏర్పడే ట్రాఫిక్ జాం నివారణకు ఎంతగానో ఉపయుక్తంగా ఉండగలదు.

హైదరాబాద్ నుండి ఉప్పల్ మీదుగా భువనగిరి, ఘటకేసర్, జనగాం, ఆలేరు, యదాద్రి, వరంగల్ వంటి ప్రాంతాలకు వెళ్ళే వారికీ ఏంతో సౌకర్యం గా ఉండగలదు.

 6.25 కి.మీ నిడివి గల ఎలివేటెడ్ కారిడార్, ప్రయాణ సమయంలో ఆదా, రహదారి భద్రతకు ప్రాముఖ్యత, నగరంలో తరచూ ఏర్పడే ట్రాఫిక్ జాం లు నివారించి నగర పౌరులకు చక్కటి ప్రయాణ సదుపాయాన్ని కల్పించడం, కాలుష్యం లేకుండా పర్యావరణహితంగా ఉండే విధంగా రూపకల్పన.

 

 ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి ని  కలసి వినతి పత్రం సమర్పించిన మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలోని  ప్రత్యేక బృందం లో తెలంగాణ రాష్ట  పార్లమెంట్ సభ్యలు జితేందర్ రెడ్డి, ఆర్ అండ్ బీ మఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఇంజ‌నీర్ ఇన్ చీఫ్ గ‌ణ‌ప‌తి రెడ్డి,  రాష్ట్ర అధికారులు ఉన్నారు. ఈ సమావేశంలో తెలంగాణా రహదారుల ప్రగతిపై  చర్చించారు. కేంద్రంలో పెండింగ్ లో  ఉన్న కొన్ని అనుమతుల విషయమై లేఖ అందించారు.

 

 

 



 

 

 

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.