*సిద్ధిపేట జిల్లా ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు శిరస్సు వంచి పాదదాభివందనo.
*ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో…
*దరఖాస్తు ఇచ్చిన చోటే జిల్లా ఆవిష్కరించుకున్నామని.. తమ జన్మ ధన్యమైందన్నారు హరీశ్.
*కేసీఆర్ అంటే నాలెడ్జ్, కమిట్ మెంట్, రీకన్ స్ట్రక్షన్ గా ఉన్నారన్నారు.
*సిద్ధిపేట గురించి ఎన్నో అడగాలని ఉంది. కానీ సీఎం కేసీఆర్ కు చెప్పాలంటే హనుమంతుడి గురించి కుప్పిగంతులు వేసినట్టే ఉంటుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తానకి విస్తరించిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు స్ఫూర్తిగా నిలిచిన మానేరు మంచినీళ్లు గ్రిడ్ ను 1999 – 2000 సంవత్సరంలోనే ఇచ్చిన ఘనత కేసీఆర్ కే సొంతమైందన్నారు. జిల్లా ఇచ్చారు, రెండు నేషనల్ హైవేలు ఇచ్చారు.. అన్నీ ఇచ్చారు.
*సిద్ధిపేట వాసులకు దసరా కానుక అడుగుతున్నాను. మీరు అన్నీ చేశారు.
*అయితే మంచి మెడికల్ కాలేజీ కోరుతున్నాం. అంతేకాదు సిద్ధిపేటలో కలిసిన గ్రామాల అభివృద్ధి కోసం.. స్పెషల్ ఫండ్ ఇవ్వాలని కోరుతున్నాను. 2009 అక్టోబర్ 25న ఏ అంబేద్కర్ భవన్ లో అయితే జైల్ భరోకు పిలుపునిచ్చారో.. అదే భవన్ లో సిద్ధిపేట కొత్త కలెక్టరేట్ ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉంది.