*పోలీస్ కంట్రోల్ భవన ప్రారంభానికి వచ్చిన మంత్రి హరీష్ రావుకు స్వాగతం పలుకుతున్న పోలీస్ కమీషనర్ శివకుమార్.
*సిద్దిపేటలో నూతనంగా ప్రారంభమైన పోలీస్ కంట్రోల్ భవనం
*సిద్దిపేటలో పోలీస్ కమాండ్ కంట్రోల్ ను ప్రారంభించిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. – చైతన్య, గజ్వేల్
సిద్దిపేట- పొన్నాల గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన అధునాతన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సోమవారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి .హరీశ్ రావు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్ సీ బోడకంటి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ విప్ పాతూరి సుధాకర రెడ్డి ,యం.యల్. సి. యం.డి ఫారూఖ్ హుస్సేన్, యం.పీ కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర పోలీస్ గృహనిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్,పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లారెడ్డి, సిద్దిపేట పోలీస్ కమీషనర్ శివ కుమార్, సిద్దిపేట్ జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ కమాండ్ కంట్రాల్ సెంటర్ ను అత్యధునిక సాదుపాయాలతో నిర్మాణం జరిగిందని. 6 ఎకరాల 30 గుంటల భూమి ప్రభుత్వం కేటాయింపు జరిగింది, 3 కోట్ల రూపాయలతో నిధులతో 14,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత విశాలమైన గదులతో భవన నిర్మాణం జరిగిందని చెప్పారు. — చైతన్య, గజ్వేల్