×

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళీ దేవాలయంలో మాడల్ కిచన్

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళీ దేవాలయంలో మాడల్ కిచన్

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళీ దేవాలయంలో 6 లక్షలతో ఏర్పాటు చేసిన మాడల్ కిచన్ ను బుధవారం రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కార్పోరేటర్ శ్రీమతి అత్తెల్లి అరుణ శ్రీనివాస్
గౌడ్  , ఆలయ ఈఓ అన్నపూర్ణ  లతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే అన్ని వర్గాల ప్రజలు ప్రతీ పండుగను ఎంతో బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారని,
అమ్మవారి బోనాల జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. అమ్మవారికి స్వంత నిధులతో డైమండ్ తో ముక్కుపుడక, బోట్టు, ఖడ్గం, సమర్పిస్తున్నామని  250  కిలోల వెండితో గర్భగుడికి వెండి
కౌశ్యం ఏర్పాటు చేస్తామని , అమ్మవారికి తొలిసారిగా బంగారం బోనము సమర్పిస్తున్నామని  భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఈసారి జాతరను ఘనంగా నిర్వహిస్తామని,బోనాల
ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి అని అన్నారు ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ జియం సుదర్శన్ , స్ట్రీట్ లైట్ డీఈ మహేష్ ,ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ నరేష్ , హార్టికల్చర్ సూపర్ వైసర్ జోయెబ్ తో పాటు నాయకులూ పాల్గొన్నారు

print

Post Comment

You May Have Missed