బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ ప్రవచన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంటోంది . శ్రీశైలం పుష్కరిణి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటైన వేదిక నుంచి వద్దిపర్తి అర్థనారీశ్వర తత్త్వం పై ప్రవచనం చేస్తున్నారు. శుక్రవారం నాలుగో రోజున ప్రవచనానికి ముందు దేవస్థానం వారు బ్రహ్మశ్రీ వద్దిపర్తి గారికి పూలమాల వేసి స్వాగతం పలికారు. వేదికపై జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది . పరమేశ్వరునికోసం పార్వతిదేవి తపస్సు ఘట్టాన్ని వివరించారు. అర్థనారీశ్వర స్వరూపం విశేషాలను వివరించారు. ఈ స్వరూప కటాక్షం తోనే దిక్పాలకులకు ఆధిపత్యం లభించిందన్నారు. మంత్రములకు ప్రాణమైన ఓంకారం పరమేశ్వరుడని చెప్పారు. పార్వతీ పరమేశ్వరుల ఆరాధన తో సకల శుభాలు పొందవచ్చునన్నారు . శ్రీశైల క్షేత్ర మహిమ వివరించారు.