*సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది-
మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సమాచార పౌర సంబంధాల కమిషనర్ అర్వింద్ కుమార్ *
న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మంగళవారం “దేశంలో గల 29 వ రాష్ట్రం గురించి తెలుసుకోండి” శీర్షికన ఒక రోజు వర్క్‌షాప్ ను వర్చువల్ వీడియో ద్వారా తెలంగాణ రాష్ట్ర సమాచార కేంద్రం నిర్వహించింది. ఈ వర్క్ షాపులో ప్రధాన వక్తగా మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ హైదరాబాద్ నుండి మున్సిపల్ కార్యాలయంలో గల తన ఛాంబర్ నుండి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, దేశంలో 29 వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించిందని,కేవలం ఆరు సంవత్సరాల కాలంలోనే అధ్బుతమైన ప్రగతి సాధించిందని అన్నారు.
వివిధ రాష్ట్ర లలోపనిచేస్తున్న సమాచార పౌర సంబంధాల అధికారులు,నిపుణులను ఒక్క తాటి పైకి తీసుకుని రావడం, ఈరంగంలోవృత్తిపరమైన నైపుణ్యాలను, ప్రమాణాలను పెంపొందించడం, వార్త ప్రసారం లో వచ్చే ఇబ్బందులను అధికమించడం,సమాచార శాఖ లో పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకునే ధోరణి తోపాటు సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవడం వంటి పలు అంశాలను సమగ్రంగా చర్చించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అర్వింద్ కుమార్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి నిర్మూలనకు తీసుకున్న పకడ్బందీ చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయనిఅర్వింద్ కుమార్ తెలిపారు. కరోనా మహమ్మారిని అదుపులోకి తీసుకురావడం, అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడం తోపాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాల విజయవంతానికి ప్రజలలోకి తీసుకుని వెళ్ళే ప్రచార బాధ్యతను సమచారశాఖ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల కు మీడియా అకాడమీ ద్వారా ఎడిటర్లు, సీనియర్ రిపోర్టర్లతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. అనంతరం ఆయన వివిధ రాష్ట్ర ప్రభుత్వాలలో ప్రాతినిధ్యం వహిస్తున్న అధికారులతో సంభాషించారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పరిణామ క్రమం ,ఘన చరిత్ర, అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాల అములును,తెలంగాణ భవన్ పనితీరును వివరించారు.ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుండి అడిషనల్ డైరెక్టర్లు నాగయ్య, కిషోర్ బాబు, జాయింట్ డైరెక్టర్ జగన్, అసిస్టెంట్ డైరెక్టర్ యామిని పాల్గొనగ న్యూఢిల్లీ నుండి అసిస్టెంట్ డైరెక్టర్ హర్ష భార్గవి, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, బీహార్, కేరళకు చెందిన ఐ అండ్ పిఆర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.